Property Tax: కొత్త ఆస్తి పన్ను విధానంపై మున్సిపల్ శాఖ కసరత్తు.. పట్టణాల్లో పన్ను ‘పోటు’ తప్పదా?

తెలంగాణలో కొత్త ఆస్తిపన్ను విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విలువలు పెరిగిన నేపథ్యంలో ఆస్తి పన్నుల్లోనూ మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది.

Property Tax: కొత్త ఆస్తి పన్ను విధానంపై మున్సిపల్ శాఖ కసరత్తు.. పట్టణాల్లో పన్ను 'పోటు' తప్పదా?
Property Tax Valuation System
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2021 | 6:48 AM

Property Tax in Municipalities: తెలంగాణలో కొత్త ఆస్తిపన్ను విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విలువలు పెరిగిన నేపథ్యంలో ఆస్తి పన్నుల్లోనూ మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆస్తిపన్ను సైతం పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ విలువలను సవరించకుంటే ప్రతి రెండేళ్లకు ఐదు శాతం ఆస్తిపన్ను పెంచే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది డిసెంబరు 11 న పురపాలక శాఖ ఇచ్చిన జీవో 280 మేరకు జీహెచ్ఎంసీ మినహా మిగిలిన నగరపాలక సంస్థలు , 141 పురపాలక సంఘాల్లో కొత్త ఆస్తి పన్ను విధానం అమలుకు వీలుగా పురపాలకశాఖ ప్రాథమిక కసరత్తు చేస్తోంది .

కొత్త విధానంలో ఎంత ఆస్తిపన్ను పెంచాలన్న దానిపై పురపాలక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును ప్రస్తుతం నిర్ణయిస్తున్నారు. భవనం ఎన్నేళ్ల క్రితం అనే దానిని పరిగణంలోకి తీసుకుని ఆస్తిపన్ను నిర్ధారించనున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువను ఆస్తిపన్ను మదింపునకు పరిగణనలో తీసుకుంటారు. భూముల విలువ, ఆస్తుల విలువ పెరుగుదల ప్రాతిపదికగా ఆస్తి పన్ను మొత్తం కూడా పెరుగుతుంది.

పురపాలక చట్టం -2019 ప్రకారం ఆస్తిపన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 75 చదరపు గజాలు విస్తీర్ణంలో ఉన్న భవనం, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఉంటే ఆ భవనానికి ఆస్తిపన్నును 100 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. వాణిజ్య భవనాలకు 0.25 శాతం నుంచి రెండు శాతం వరకు ఆస్తి పన్ను విధిస్తారు. నివాసభవనాలకు 0.10 శాతం నుంచి ఒకశాతం, ఖాళీ స్థలాలపై కనిష్టంగా 0.05 శాతం , గరిష్టంగా 0.20 శాతం విలువలో కనిష్టంగా 0.05 శాతం , గరిష్టంగా 0.20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఒక స్థలంలో నిర్మాణం కాకుండా మిగిలి ఉన్న ఖాళీ స్థలానికి పన్ను వర్తిస్తుంది. నిర్మాణ సమయం లేదా రిజిస్ట్రేషన్ సమయంలో ఖాళీ స్థలం పన్నును నిర్దేశించిన మేర చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ నిర్మాణానికి సంబంధించి ముందుగానే నో డ్యూ సర్టిఫికెట్ అందచేయాల్సి ఉంటుంది. అయితే, రెండేళ్లకోసారి మార్కెట్ విలువల సవరణ ప్రకారం ఆస్తిపన్నును సవరించే అధికారం పురపాలక కమిషనర్లకు కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త ఆస్తి పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాన్ని పురపాలక కమిషనర్ నోటిపై చేయాల్సి ఉంటుంది . వీటికి సంబంధించి పురపాలక సంఘం ప్రత్యేక రిజిస్టర్​ను నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా, ఆస్తి పన్నుకు సంబంధించి కొన్నింటిని మినహయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్.. ప్రార్థనా మందిరాలు, దాతృత్వ కార్యక్రమాలు వినియోగించే స్థలాలు , అనాథ , వృద్ధాశ్రమాలు , జంతు సంరక్షణ కేంద్రాలు , గ్రంథాలయాలు , ఆటస్థలాలు , పురాతన , చారిత్రక, స్మారక కట్టడాలు, ఆస్పత్రులు, వైద్యశాలలు, శ్మశాన వాటికలు, పురపాలక భవనాలు, మునిసిపల్ స్థలాలు, సైనికులు, మాజీ సైనికులకు చెందిన నివాసభవనాలు ఉంటేనే మినహాయింపు వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 25 రెట్ల ఆస్తిపన్నును జరిమానాగా విధించనున్నారు. ఆస్తిపన్ను మదింపు కొత్త విధానానికి అమలుపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పటికే జీవో 230లోని కొన్ని కీలక అంశాలను పురపాలకశాఖ అమలు చేస్తోంది. స్వీయ ధ్రువీకరణ విధానంలో ఆస్తిపన్ను మదింపు , నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై జరిమానాలతో పాటు ఇతర చర్యలను పురపాలకశాఖ తీసుకుంటోంది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 25 రెట్ల ఆస్తిపన్నును జరిమానాగా విధిస్తోంది.

Read Also… Health Tips: శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవడం లేదా? అయితే, ఈ వంటింటి చిట్కాను ప్రయత్నించండి..