Hyderabad Rain: భారీగా కురిసిన వర్షాలకు భాగ్యనగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. గురువారం రాత్రి ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి వణికిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్గడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ప్రవహించాయి. దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో కీలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నగరంలోని కూకట్‌పల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, షేక్ పేట్‌లో 9.8 సెం.మీ, శేరిలింగంపల్లిలో 8.8 సెం.మీ, సరూర్ నగర్‌లో 8.3 సెం. మీ, ఖైరతాబాద్ 7.6 సెం.మీ, బాలానగర్ 7.9 సెం.మీల వర్షపాతం కురిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని జిహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు యుద్ధ ప్రాతిపదిక తొలగించారు. ఇక నీటమునిగిన పలు కాలనీలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని మ్యాన్ హోల్ మూతలు తెరిచి నీటిని తొలగించారు. మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నీటితో ఉన్న రోడ్లపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని సూచించారు.
రానున్న మూడు రోజుల్లో కూడా తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: Funny Samosa: ఇలాంటి సమోసాను మీ జీవితంలో చూసి ఉండరు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఫోటో..
Bank Robbery: చోరీ కోసం బ్యాంకులో చొరబడ్డారు.. షెట్టర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన దొంగలకు సీన్ సితారే..
Viral Video: మంత్రిగారా మజాకా.. రిబ్బన్ ఇలా కూడా కట్ చేస్తారా?.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..