Viral Video: మంత్రిగారా మజాకా.. రిబ్బన్ ఇలా కూడా కట్ చేస్తారా?.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Viral Video: దాయాది దేశం పాకిస్తాన్‌ గురించి మనకు తెలిసిందే. నిత్యం ఘర్షణలు, గిల్లికజ్జాలతో కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. భారత్ కూడా అంతే స్థాయిలో ఆ దేశానికి బుద్ధి చెబుతూ వస్తోంది.

Viral Video: మంత్రిగారా మజాకా.. రిబ్బన్ ఇలా కూడా కట్ చేస్తారా?.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Pak Minister

Viral Video: దాయాది దేశం పాకిస్తాన్‌ గురించి మనకు తెలిసిందే. నిత్యం ఘర్షణలు, గిల్లికజ్జాలతో కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. భారత్ కూడా అంతే స్థాయిలో ఆ దేశానికి బుద్ధి చెబుతూ వస్తోంది. అయితే, పాలనా పరంగా పరిస్థితులు ఇలా ఉంటే.. ప్రజల పరంగా సంబంధ బాంధవ్యాలు సక్రమంగానే కొనసాగుతున్నాయి. ఆ దేశ ప్రజలు మనదేశంలోకి రాకపోకలు సాగించడం, మన దేశ ప్రజలు ఆదేశంలోకి రాకపోకలు సాగించడం పరిపాటిగా సాగుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు పాక్‌లో ప్రదర్శించడం వంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పాలి. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ మంత్రి చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

వాస్తవానికి, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి ఫయాజ్ అల్ హసన్ చోహన్ ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఎక్కడ మంత్రి రెడ్ టేప్ కట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన ఆ రిబ్బన్‌ను కత్తెరతో కట్ చేయలేదు. నిర్వాహకులు కత్తెర ఇచ్చినా.. అది కట్ కాలేదు. దాంతో వెంటనే కత్తెరను పక్కకు పడేసిన మంత్రి.. తన నోటికి, పళ్లకు పని చెప్పారు. నోటితో ఆ రిబ్బన్‌ను కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించాడు. ఆ సమయంలో మంత్రి.. హమ్మయ్య నా పని కంప్లీట్ అయ్యిందన్నట్లుగా ముసిముసి నవ్వులు నవడం, చుట్టూ ఉన్న జనాలు కూడా మంత్రి చేసిన పనికి నవ్వడం గమనించవచ్చు.

అయితే, దీనికి సంబంధించి 27 సెకన్ల వీడియోను జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్ తన ట్విట్టర్ అకౌంట్ @rsrobin1 లో షేర్ చేశారు. ఈ వీడియోను ఒక గంటలో నాలుగు వేలకు పైగా వీక్షించారు. కొంతమంది నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. విపత్తులో అవకాశం వెతుక్కోవడం అంటే ఇదే అంటూ కొందరు లాజిక్ మాట్లాడుతుండగా.. చాలా సమయాన్ని ఆదా చేశాడంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలాఉంటే.. పాక్‌, చైనా బంధాన్ని ముడిపెడుతూ మరో నెటిజన్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ దేశం.. కత్తెరతో సహా అన్ని వస్తువులను ఉచితంగా పొందుతున్నప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇది ఇమ్రాన్ ఖాన్ నయా పాకిస్తాన్ అంటూ మరికొందరు కామెంట్స్ వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

IND vs ENG 4th Test Day 1 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన తొలిరోజు ఆట.. బౌలర్లదే హవా..

M. K. Stalin: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సతీసమేతంగా కలిసిన తమిళ్ సీఎం స్టాలిన్..

Rashi Khanna: తెల్ల పూలతో, కవ్వించే చూపులతో మనసు దోచుకుంటున్న బొద్దు ముద్దుగుమ్మ రాశి ఖన్నా..

Click on your DTH Provider to Add TV9 Telugu