Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smita Sabharwal: పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. భద్రాద్రి పర్యటనలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్

పౌష్టికాహార లోపంతో బాధపడుతున చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సూచించారు. భద్రాచలంలో పర్యటించారు ప్రభుత్వ ఉన్నతాధికారులు.

Smita Sabharwal: పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. భద్రాద్రి పర్యటనలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
Cmo Smita Sabarwal
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2021 | 7:17 AM

CMO Smita Sabharwal Visit Bhadradri: పౌష్టికాహార లోపంతో బాధపడుతున చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సూచించారు. భద్రాచలంలో పర్యటించారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తోపాటు.. పలువురు అధికారులు టెంపుల్‌సిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

భద్రాద్రి జిల్లా మండలం సర్వారం అంగన్‌వాడీ కేంద్రాన్ని, పీహెచ్‌సీని గిరిజన సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్‌ చాంగ్తూ, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్‌, మెడికల్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యలతో కలిసి స్మితా సబర్వాల్‌ గురువారం పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందజేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ అనుదీప్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మారుమూల ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు అందిస్తున్న అభినందనీయమని ప్రశంసించారు. మంచి సేవలు అందిస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. పాలియేటీవ్‌ కేర్‌ యూనిట్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. నిరాదరణకు గురై అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం భద్రాచలం సీతరాములను దర్శించుకుని ప్రత్యక పూజలు చేశారు. సీతా రామాలయం అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులకు అమ్మవారి ఆలయంలో వేదపండితులచే వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికలు అందచేశారు. ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ ఆలయ ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు స్మితా సబర్వాల్.

Cmo Smita Sabarwal Bhadradri

Cmo Smita Sabarwal Bhadradri

ఆలయ దర్శనం అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణుల వార్డులో నర్సుల పనితీరును అడిగి తెలుసుకున్నారు స్మితా సబర్వాల్. డెలివరీ సమయంలో ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన మిడ్ వైఫ్స్‌ నర్సింగ్ విధానాన్ని వారి పనితీరును అడిగి తెలుసుకుని వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షయ నివారణ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. Read Also… Property Tax: కొత్త ఆస్తి పన్ను విధానంపై మున్సిపల్ శాఖ కసరత్తు.. పట్టణాల్లో పన్ను ‘పోటు’ తప్పదా?