భర్త, ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. విషయం తెలిసిన జంట ఏం చేసిందంటే..?
తాళి కట్టినవాడిని కాదని, మరో వ్యక్తి మోజులో పడి వెళ్లిపోయింది. పరువు పోయిందని భావించిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఆ జంట కూడా ప్రాణాలను తీసుకుంది.
Illegal affair in Khammam District: తాళి కట్టినవాడిని కాదని, మరో వ్యక్తి మోజులో పడి వెళ్లిపోయింది. పరువు పోయిందని భావించిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఆ జంట కూడా ప్రాణాలను తీసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో అలస్యంగా వెలుగు చూసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధం మూడు నిండుప్రాణాలను బలిగొందని తెలిపారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య (32), కృష్ణవేణి (27) భార్యాభర్తలు. వీరికి చందన్‌కుమార్ (10), వెంకటలక్ష్మి (7) అనే ఇద్దరు సంతానం. అయితే, భర్త ఉండగానే అదే అదే కాలనీకి చెందిన ధర్మయ్య (30)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. ఈ విషయం భర్త బాలయ్యకు తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే, కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్య-భర్తల మధ్య విభేదాల నేపథ్యంలో ధర్మయ్య భార్య విస్సన్నపేట పోలీసు స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టారు. అతడు భార్యాబిడ్డలకు దూరంగా లంకపల్లిలోనే నివసించేవాడు. ఈ క్రమంలోనే కృష్ణవేణితో ధర్మయ్యకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, ఆగస్టు 26న వారిద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఈ అవమాన భారం భరించలేక బాలయ్య గత నెల 27న ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆగస్టు 29న మృతి చెందాడు.
ఇదిలావుంటే, అదే కాలనీకి చెందిన వజ్రమ్మ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారం తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దుస్తుల ఆధారంగా మృతదేహాలు ధర్మయ్య, కృష్ణవేణిలవని స్థానికులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌కుమార్ (10), వెంకటలక్ష్మి (7) అనాథలయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
Read Also… Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!