Maharashtra: 8 నెలలు ఎంజాయ్ చేశాడు.. రూ. 25 లక్షల బిల్లు చేశాడు.. ఆ తరువాత బాత్రూమ్ కిటీకీ నుంచి..

Shiva Prajapati

Shiva Prajapati | Edited By: Ravi Kiran

Updated on: Sep 03, 2021 | 6:24 AM

Maharashtra: ఓ వ్యక్తి దాదాపు 8 నెలల పాటు హోటల్‌లో బస చేసి, రూ. 25 లక్షల బిల్లు చేల్లించకుండా పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటు చేసుకుంది.

Maharashtra: 8 నెలలు ఎంజాయ్ చేశాడు.. రూ. 25 లక్షల బిల్లు చేశాడు.. ఆ తరువాత బాత్రూమ్ కిటీకీ నుంచి..
Rains
Follow us

Maharashtra: ఓ వ్యక్తి దాదాపు 8 నెలల పాటు హోటల్‌లో బస చేసి, రూ. 25 లక్షల బిల్లు చేల్లించకుండా పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. పారిపోయిన వ్యక్తిని అంధేరి నివాసి మురళీ కామత్‌గా ముర్తించారు. మురళీ కామత్‌గా ఖార్ఘర్ ప్రాంతలోని ఓ త్రిస్టార్ హోటల్‌లో రెండు గదులను తీసుకున్నాడు. తన 12 సంవత్సరాల కొడుకుతో కలిసి అతను హోటల్‌కు వచ్చాడు. దాదాను 8 నెలలుగా 25 లక్షల బిల్లు చేశాడు. తీరా చూస్తే ఆ బిల్లు చెల్లించకుండానే హోటల్ నుంచి పారిపోయాడు మురళి. ఈ వ్యహారంపై హోటల్ ప్రతినిథులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామత్ గత సంవత్సరం నవంబర్ 23 న మొదటిసారి హోటల్‌కు వచ్చాడు. అతను చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నట్లు సిబ్బందికి పరిచయం చేసుకున్నాడు. రెండు సూపర్ డీలక్స్ గదులను బుక్ చేసుకున్నాడు. ఒక గది అతని బస కోసం కాగా, మరొక గది పనికి సంబంధించిన మీటింగ్‌ల కోసం. అతను ఒక నెల తర్వాత డిపాజిట్ చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు గానూ అతను తన పాస్‌పోర్ట్‌ను తాకట్టుగా పెట్టాడు. అయితే, గత ఏడాది నవంబర్‌లో హోటల్‌లోకి దిగిన కామత్.. ఈ ఏడాది మే నెల వరకు డబ్బులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కామత్ హోటల్ బిల్లు చెల్లించకుండా బాత్రూమ్ కిటికీ నుంచి తన కొడుకుతో కలిసి పారిపోయాడు. కామత్ తన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను గదిలోనే ఉంచి వెళ్లాడు. ఈ వ్యవహారంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న హోటల్ సిబ్బంది తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. మరో ఘటనలో 16 ఏళ్ల బాలుడు తన ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కూడా ముంబైలోనే చోటు చేసుకుంది. పబ్జీ ఆడటానికి తన తల్లి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 10 లక్షలు ఖర్చు చేశాడు ఆ బాలుడు. దాంతో ఆగ్రహానికి గురైన బాలుడిన తండ్రి.. తీవ్రంగా మందలించాడు. దాంతో భయాందోళనకు గురైన బాలుడు.. ‘ఇక సెలవు.. ఇంటికి తిరిగి రాను’ అంటూ లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దాంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇంటినుంచి పారిపోయిన బాలుడి కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ముంబైలోని అంధేరి ప్రాంతంలోని మహంకాళి ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Also read:

NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

Bank Robbery: చోరీ కోసం బ్యాంకులో చొరబడ్డారు.. షెట్టర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన దొంగలకు సీన్ సితారే..

Pawan Kalyan: వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu