Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Gold Price Today: దేశంలో బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత పసిడి ధరలు రోజురోజుకు దిగివస్తున్నాయి...

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!
Follow us

|

Updated on: Sep 03, 2021 | 7:03 AM

Gold Price Today: దేశంలో బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత పసిడి ధరలు రోజురోజుకు దిగివస్తున్నాయి. గతంలో 50వేలకు పైగా ఉన్న ధరలు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

అయితే అన్ని ప్రాంతాల్లో అన్ని ధరలు ఒకేలా ఉండవు. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు చేయడం మాత్రం ఆగరు. పది గ్రాముల ధరపై స్వల్పంగా అంటే రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం (సెప్టెంబర్‌ 3న) ఉదయం ఆరు గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,580 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,230 ఉంది.

అయితే బంగారం ధరలు తగ్గింపు, పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Royal Enfield Classic 350: గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి క్లాసిక్ 350 మోడల్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు

SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..