- Telugu News Photo Gallery Business photos Land Rover Defender V8 Bond Edition revealed, limited to 300 units
Land Rover: ల్యాండ్ రోవర్ డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్ వచ్చేస్తోంది.. లంబోర్గిని ఉరుస్‌కు ధీటుగా..!
Land Rover: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. అతి ..
Updated on: Sep 03, 2021 | 8:46 AM

Land Rover: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. అతి తక్కువ సమయంలోనే అతివేగంగా ప్రయాణించే వాహనాలను తీసుకువస్తున్నాయి.

టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది.

రహదారి మార్గాల్లో లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్‌ఎస్‌క్యూ8, బీఎండబ్లయ్యూ ఎక్స్ 5ఎమ్ తరహాలో ఫర్మామెన్స్ చేస్తున్న డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది.

5.0 లీటర్ సూపర్‌చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్‌ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్‌టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపర్చారు.

డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.





























