Telstra: హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ స్థలంలో ఆఫీస్‌ కార్యకలాపాలు..!

Telstra: ఫార్మా, ఎయిరోస్పేస్‌, ఐటీ, క్లౌడ్‌ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం..

Telstra: హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ స్థలంలో ఆఫీస్‌ కార్యకలాపాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2021 | 9:42 AM

Telstra: ఫార్మా, ఎయిరోస్పేస్‌, ఐటీ, క్లౌడ్‌ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం టెల్‌స్ట్రా ఇండియాలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. అందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. అయితే టెల్‌స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్‌ రంగంలో వస్తోన్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్‌ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి.

కాగా, టెల్‌స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్‌ హై పెర్ఫార్మెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ (హెచ్‌పీఎస్‌ఈ)గా ఏర్పాటు చేయనున్నారు. టెలికాం సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కన్సుమర్‌ బేస్డ్‌ డీప్‌ టెక్నాలజీ ఆవిష్కరణలు హైదరాబాద్‌ ఉండనున్నాయి. త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్‌ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీకి కేరాఫ్‌ చిరునామాగా ఉంటాయని టెల్ స్ట్రా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌టీ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు.

భారీగా విస్తరణ

టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలిసారిగా ఆస్ట్రేలియాకి బయట బెంగళూరులో గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్‌ని 2019లో ప్రారంభించింది. రెండు సంవత్సరాల కిందట 200 మందితో ప్రారంభమైన బెంగళూరు క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వెయ్యి మందికి చేరింది. ఇప్పుడు తొలి ఇన్నెవేషన్‌ సెంటర్‌ను మించేలా పుణే, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల స్థలంలో కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహించాలని టెల్ స్ట్రా భావిస్తోంది.

Telstra

ఇవీ కూడా చదవండి:

Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

Land Rover: ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ వీ8 బాండ్‌ ఎడిషన్‌ వచ్చేస్తోంది.. లంబోర్గిని ఉరుస్‌కు ధీటుగా..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే