Rakul Preet Singh: ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్.. ఆఫీస్ దగ్గర ఎన్నడూ లేనంత భారీ భద్రత..!

ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రకుల్ రాక నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ

Rakul Preet Singh: ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్.. ఆఫీస్ దగ్గర ఎన్నడూ లేనంత భారీ భద్రత..!
Rakul Preet Singh

ED – Drugs Case: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రకుల్ రాక నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆఫీస్ దగ్గర భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను పోలీసులు లోపలకి అనుమతించలేదు. రకుల్ విచారణకు వస్తున్న వేళ ఈడి ఆఫీస్ ముందు ఎప్పుడూ లేనంత భద్రత కల్పించడం విశేషం. కాగా, డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్‌ సరఫరా, మనీ లాండరింగ్‌, ఫెమా.. ఇలా ఇప్పటికే విచారణకు హాజరైన టాలీవుడ్‌ స్టార్స్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు.

డ్రగ్స్‌ దందాలో సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? బాధితులు ఎవరు ? నిందితులు ఎవరు ? అని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, నటి చార్మిని విచారించారు అధికారులు. కాగా, ఈడీ అధికారుల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 6వ తేదీన రకుల్‌ప్రీత్‌సింగ్‌ విచారణకు హాజరు కావాలి. అయితే అనివార్య కారణాలతో ఆ రోజు తాను రాలేనంటూ రకుల్‌ రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే.. డేట్ మార్చేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ ఆమె మరో మెయిల్ పంపారు. దీనికి ఈడీ సమ్మతించింది. దీంతో కాసేపట్లో ఎంక్వైరీకి హాజరవుతారు రకుల్‌ప్రీత్‌సింగ్‌.

డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా టాలీవుడ్‌ నటీనటులకు ఈడీ అధికారులు నోటీసుల ఇవ్వడంతో రకుల్‌ని కూడా కెల్విన్‌ గురించి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. కెల్విన్‌ మీకు ఎలా తెలుసు ? ఎప్పటి నుంచి తెలుసు ? అతడికి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారా ? లాంటి క్వొశ్చన్స్‌ అడిగే అవకాశం ఉంది. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ విచారణ కీలకంగా మారే అవకాశం ఉంది. గతేడాది ఆమె ముంబైలోను విచారణ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. డ్రగ్స్‌ వాడకంపై ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఫోకస్ చేసింది.

ఆ సమయంలో.. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన ముంబై NCB ముందు విచారణకు హాజరయ్యారు రకుల్ ప్రీత్‌ సింగ్. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో కూడా నోటీసులు రావడంతో ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. దీంతో గత ఏడాది జరిగిన NCB విచారణపై కూడా క్వొశ్చన్స్‌ సంధించే అవకాశం ఉంది. ఇప్పుడు NCB విచారణకు ఎందుకు పిలిచింది ? ఎలాంటి వివరణ కోరింది? మీరు ఏం సమాధానం చెప్పారు? అనే ప్రశ్నలను కూడా ఈడీ అడిగే అవకాశం ఉంది.

Read also: Butchaiah Chowdary: కార్పొరేట్‌ తరహా సరికాదు.. బాబుతో వన్‌ టు వన్‌ టాక్.. తేల్చిసిన సీనియర్ నేత

Click on your DTH Provider to Add TV9 Telugu