- Telugu News Photo Gallery Technology photos Is Your Phone Getting Hang Here Some Simple Tips For Fast Your Phone
Smartphone Hang: మీ ఫోన్ పదే పదే హ్యాంగ్ అవుతోందా..? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, రిజల్ట్ ఉంటుంది.
Smartphone Hang: స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే వారిలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఫోన్ హ్యాంగింగ్ ఒకటి. ఫోన్ ఉపయోగించే సమయం పెరుగుతున్నా కొద్దీ ఫోన్ వేగం నెమ్మదిస్తుంటుది. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో..
Updated on: Sep 03, 2021 | 12:28 PM

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారికి ఎదురయ్యే సమస్యల్లో ఫోన్ హ్యాంగ్ ప్రధానమైంది. మొదట్లో చాలా వేగంగా పనిచేసిన స్మార్ట్ ఫోన్ తర్వాత స్లోగా మారుతుంది. పదే పదే ఫోన్ స్ట్రక్ అవుతుంటుంది. ఈ సమస్యను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటారు.

అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో నెమ్మదించిన ఫోన్ వేగాన్ని మళ్లీ తిరిగి వేగాన్ని పెంచొచ్చు. ఇందులో మొదటిది ఈ ఫోన్‌లో పెద్దగా ఉపయోగం లేని యాప్‌లను తొలగించాలి. ఫోన్ మెమోరీ నిండిపోయినా మొబైల్ వేగం నెమ్మదిస్తుందని తెలుసుకోండి.

కేవలం యాప్స్ మాత్రమే కాకుండా ఫోన్‌లో ఉండే ఎక్కువ మెమోరీ ఉన్న ఫైల్స్, అనవసరమైన ఫొటోలను డిలీట్ చేస్తుండాలి.

పెరిగిపోయే కాచ్ డేటా కూడా స్మార్ట్‌ఫోన్ వేగాన్ని తగ్గిస్తుంటుంది కాబట్టి స్టోరేజ్ ఆప్షన్‌లో ఉండే 'క్యాచ్‌డ్ డేటా'ను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి.

మొబైల్ ఫోన్‌లో క్లీన్ మాస్టర్ వంటి యాప్‌లను ఉపయోగించడం ద్వారా కూడా ఫోన్ వేగాన్ని పెంచొచ్చు. ఈ యాప్‌తో తరచూ ఫోన్‌లో ఉండే ఫైల్స్‌ను క్లియర్ చేస్తుండాలి.

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని తక్కువగా ఉపయోగించుకునే క్రమంలో కొన్ని క్లౌడ్ స్టోరేజ్‌లను ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి తగ్గి వేగంగా పని చేస్తుంది.





























