Tollywood Heroine: ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.? గుర్తు పట్టగలరా..?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 04, 2021 | 11:41 AM

ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా సరే.. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తారు. ఇక వారి చిన్ననాటి వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతాయి. చాలామంది...

Tollywood Heroine: ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.?  గుర్తు పట్టగలరా..?
Tollywood

Follow us on

ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా సరే.. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తారు. ఇక వారి చిన్ననాటి వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతాయి. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇదే కోవలో ఓ హీరోయిన్‌కి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమెను ఎక్కడో చూసినట్లుందే.. అర్రే బాగా తెలిసిన మొహంలా కూడా అనిపిస్తుందే.. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుందే కానీ గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా..?.. ఆగడాగంటి ఇక మేము రివీల్ చేస్తాం.

ఇంతకీ ఆమె ఎవరో కాదు. హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి. టాలీవుడ్‌లోకి ఫిదా సినిమాతో అరంగ్రేటం చేసి.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే ప్రేమమ్ సినిమా ద్వారా కూడా కుర్రకారుకు ఈమె పరిచయమే. డ్యాన్స్ అంటే సాయిపల్లవికి చాలా ఇష్టం. ఆమె ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు. సాయిపల్లవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కస్తూరి మాన్’ అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ సినిమాలో ఆమె స్నేహితురాలిగా నటించింది. నెక్ట్స్ మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించింది. సాయిపల్లవి జార్జియాలోని టీబీలీసీ నుంచి మెడిసిన్ పూర్తిచేసింది. తనకు కార్టియాలజిస్ట్ కావాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన మొటిమల గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది. అయితే అవే పింపుల్స్ ఇప్పుడు ఆమెను నేచురల్ బ్యూటీ చేసేశాయి. మిడిల్ క్లాస్ కుర్రాళ్లందరికీ ఆమె కనెక్ట్ అవ్వడానికి అవే కారణం. సాయి పల్లవి నటించిన విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

Sai Pallavi

Also Read: పచ్చని కాపురంలో నిప్పులు.. అక్రమ సంబంధం కాటుకు ముగ్గురు బలి

 గంటా తులసి.. స్కెచ్‌ వేస్తే ఖేల్ ఖతమే.. ఆటో ప్రయాణికులే టార్గెట్.. ఇప్పటికే 20 కేసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu