Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..

అందం.. అభినయంతోపాటు.. నెమలిలా నాట్యం చేస్తూ.. కుర్రాళ్ల కళల రాకుమారిగా మారింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్స్ షోలకు దూరంగా

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..
Sai Pallavi
Follow us

|

Updated on: Sep 04, 2021 | 9:57 AM

అందం.. అభినయంతోపాటు.. నెమలిలా నాట్యం చేస్తూ.. కుర్రాళ్ల కళల రాకుమారిగా మారింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్స్ షోలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయపు ఆడపిల్లగా ఉంటూనే… టాలీవుడ్ టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ మూవీ ప్రేమమ్‏తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంది. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‏లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కళల రాకుమారిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపిస్తుంది సాయి పల్లవి.

అటు సినిమాల్లో ఎంతగా బిజీగా ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‏గా ఉంటుంది సాయిపల్లవి. తన ఫ్యామిలీ విషయాలతోపాటు.. లెటేస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడూ నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సాయి పల్లవి ఎక్కువగా మేకప్ లేకుండానే కనిపిస్తుంటుంది. అందుకే సాయి పల్లవిని అందరూ న్యాచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. గ్లామర్ షోలకు ఆరడుగుల దూరంలో ఉండే సాయి పల్లవి.. ఎక్కువగా సంప్రదాయపు చీరకట్టులో, డ్రెస్సులలో కనిపిస్తూ.. అభిమానులకు ఆకట్టుకుంటుంది.

Sai

Sai

తాజాగా ఈ ముద్దుగుమ్మ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మలార్ పింక్ చీరకట్టులో.. సింపుల్‏గా వదిలేసిన జుట్టును సరిచేసుకుంటూ చిరునవ్వులను చిందిస్తూ కనిపిస్తు్న్న సాయి పల్లవి ఫోటోలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. తన లెటేస్ట్ ఫోటోలను సాయి పల్లవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన చెల్లెలు ఫోటోగ్రఫిపై ప్రశంసలు కురిపించింది. అనుకోకుండా.. ఆకస్మాత్తుగా అందమైన ఫోటోలను తీయగల నైపుణ్యాలు మా చెల్లెలు సొంతం అంటూ కామెంట్ చేసింది సాయిపల్లవి.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు.. న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: KTR: కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై దాదా, సెహ్వాగ్‏లను ప్రశ్నించిన అమితాబ్.. రీ ట్వీట్ చేసిన మంత్రి..

MAA Elections 2021: మా ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న నారీమణులు.. ఇక వార్ వారిద్దరీ మధ్యే..