Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: మా ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న నారీమణులు.. ఇక వార్ వారిద్దరీ మధ్యే..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలు రోజు రోజూకీ రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి

MAA Elections 2021: మా ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న నారీమణులు.. ఇక వార్ వారిద్దరీ మధ్యే..
Maa Elections
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2021 | 8:05 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలు రోజు రోజూకీ రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. దీంతో మా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయా అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో మాలో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన మా క్రమశిక్షణ కమిటీ నటి హేమకు నోటిసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పదవి ఎన్నికలలో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నటి హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ వంటి వారు పోటీ పడుతున్నారు. అలాగే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ కూడా ప్రకటించాడు. ఆయన శుక్రవారం సినీ మా బిడ్డల పేరుతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..తన ప్యానల్ సభ్యులతోపాటు.. కొత్త జాబితాతోపాటు.. మెయిన్ సభ్యుల వివరాలను ప్రకటించారు. అయితే అందులో హేమ, జీవిత రాజశేఖర్‏లు కూడా ఉండడం గమనార్హం.

నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. సినిమాకు ఎంతో చేయాలని ఉందని.. అవకాశం వస్తే చేస్తి చూపిస్తామన్నారు. గతంలో అనౌన్స్ చేసిన ప్యానెల్ సభ్యుల స్థానంలో కొత్తవారిని తీసుకున్నామన్నారు.. అందులో అనసూయ-అజయ్-భూపాల్-బ్రహ్మాజీ-ఈటీవి ప్రభాకర్-గోవింద్ రావు-ఖయ్యుం-కౌశిక్-ప్రగతి-రమణారెడ్డి-శ్రీధర్ రావు-శివారెడ్డి-సమీర్-సుడిగాలి సుధీర్-సుబ్బరాజు-సురేష్ కొండేటి-తనీష్-టార్జాన్ ఉన్నారు అయితే దీనిలో జయసుధ గారూ మెయిన్ ప్యానెల్‏లో లేరు. ఆమె అమెరికాలో వున్నారు ఆవిడ అన్ని పనులు పూర్తి అయ్యి వచ్చే పాటికి కొన్ని రోజులు పడుతుంది. ఇక మెయిన్ ప్యానెల్ విషయానికికొస్తే .. కోశాధికారి-నాగినీడు-జాయింట్ సెక్రటరీ…అనితా చౌదరి-జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్- వైస్ ప్రెసిడెంట్‌‌గా బెనర్జీ-వైస్ ప్రెసిడెంట్‌‌గా హేమ- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గా శ్రీకాంత్-జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్- అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పేర్లు అనౌన్స్ చేశారు.

ఇక ప్రకాష్ రాజ్ తాజాగా అనౌన్స్ చేసిన ప్యానెల్‏లో హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు ఉండడంతో వారు.. మా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ హేమతో మాట్లాడడని.. దీంతో హేమ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జీవితా రాజశేఖర్‌‏తో ప్రకాష్ రాజ్ రెండు గంటలకు పైగా మాట్లాడానని… మా ఎన్నికల నుంచి తప్పుకోవడానికి అంగీకరించినట్లుగా తెలిపారు ప్రకాష్ రాజ్. మొత్తానికి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య. ఇప్పుడు అసలైన పోటీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్యే ఉన్నట్లుగా టాక్.

Also Read: Chitti Song: చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. తగ్గని చిట్టి హవా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న సాంగ్..

Thalaivi Movie: ఓటీటీలోకి కంగనా సినిమా.. తలైవి విడుదల ఎప్పుడంటే..