Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chitti Song: చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. తగ్గని చిట్టి హవా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న సాంగ్..

చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే... ఇప్పటి కురకారును ఊపేస్తున్న సాంగ్ ఇది. సీనియర్ లిరిక్ రైటర్

Chitti Song: చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..  తగ్గని చిట్టి హవా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న సాంగ్..
Chitti Song
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2021 | 7:35 AM

Share

చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే… ఇప్పటి కురకారును ఊపేస్తున్న సాంగ్ ఇది. సీనియర్ లిరిక్ రైటర్ రామజోగయ్య రాసిన ఈ పాట శ్రోతలకు తెగ ఆకట్టుకుంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా.. డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జాతిరత్నాలు. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా నటించింది. శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. లాక్ డౌన్ అనంతరం తెరుచుకున్న థియేటర్లలో ఏలాంటి అంచనాలు లేకుండా.. చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు మూవీ సంచలనం సృష్టించింది. ఏకంగా 39 కోట్ల షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు రూ. 20 కోట్లకు పైగా లాభాలు అందించడమే కాకుండా. నవీన్ పొలిశెట్టి కెరీర్‏లోనే అత్యంత ఘన విజయం అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ మూవీతో నవీన్ పొలిశెట్టితోపాటు.. మిగతా చిత్రయూనిట్ సభ్యుల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇటీవల సినిమాతో సంబంధం లేకుండా.. సాంగ్స్‏కే ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక్క పాట్ హిట్ అయిన… సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నట్లే అని భావిస్తున్నారు మేకర్స్. అందుకే సినిమాతోపాటు.. పాటలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలా 2021లో విడుదలైన సినిమాల్లో ఇప్పటివరకుు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. ఇక ఈ సినిమాలోని చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే.. సాగే సాంగ్ సూపర్ హిట్ అందుకుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ సాంగ్‏కు ఫిదా అయ్యారు. తాజాగా ఈ పాట 100 మిలియన్ క్లబ్‏లో చేరిపోయింది. యుద్ధమేమి జరగలే.. సుమోలేవి అసలు ఎగరలే.. చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే పెల్చేసావే అంటూ క్యాచి లిరిక్స్ రాశాడు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను ఫోక్ సింగర్ రవి మిరియాల ఆలపించాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధాన్ సంగీతం అందించాడు. ఇక ఇప్పటికీ ఈ సాంగ్ సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

Also Read: Thalaivi Movie: ఓటీటీలోకి కంగనా సినిమా.. తలైవి విడుదల ఎప్పుడంటే..

Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‏లోకి విజయ్ దేవరకొండ..