KTR: కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై దాదా, సెహ్వాగ్‏లను ప్రశ్నించిన అమితాబ్.. రీ ట్వీట్ చేసిన మంత్రి..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 04, 2021 | 9:16 AM

దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతీ. ఈ షోకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న

KTR: కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై దాదా, సెహ్వాగ్‏లను ప్రశ్నించిన అమితాబ్.. రీ ట్వీట్ చేసిన మంత్రి..

Follow us on

దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతీ. ఈ షోకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంతో మంది సామాన్యులు, ప్రముఖులు పాల్గొని నగదు గెలుచుకున్నారు. అయితే తాజాగా ఈషోలో క్రికెట్ స్టార్స్ సెహ్వాగ్, గంగూలీ పాల్గొన్నారు. దీంతో వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు అమితాబ్.. అయితే వారికి షో మధ్యలో 39వ ప్రశ్నగా అమితాబ్ ఓ ప్రశ్న అడిగారు. అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్‏కు సంబంధించిన ప్రశ్న రావడంతో దాదా, సెహ్వాగ్‏లకు చిక్కుముడిగా మారింది.

విషయమేటంటే.. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్వీట్టర్ ఖాతాలో రెండు మెడిసిన్ పదాలు రాసి వీటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా ? అనే విధంగా ట్వీట్ చేశారు. ఇలాంటి పదాలకు కచ్చితంగా శశిథరూర్ సమాధానం చెప్పగలరని అంటూ.. ఆయనను ట్యాగ్ చేశారు.

ట్వీట్..

అయితే ఇదే ట్వీట్ ఇప్పుడు అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ప్రశ్నగా రావడంతో తెగ వైరల్ అవుతుంది. అందులో నోరు తిరగని కోవిడ్ 19 మెడిసిన్ లిస్ట్‏ను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నాలుగురి పేర్లను ఆప్షన్స్‏గా ఇచ్చారు. అందులో ఒకరు కపిలి సిబల్, సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ అనే ఆప్షన్స్ ఇచ్చారు.

తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించాడు. సరదాగా చేసిన పని అనుకోకుండా కేబీలో రావడం చాలా సంతోషంగా ఉంది. దాదా, సెహ్వాగ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది

ట్వీట్…

Also Read:  MAA Elections 2021: మా ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న నారీమణులు.. ఇక వార్ వారిద్దరీ మధ్యే..

Chitti Song: చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. తగ్గని చిట్టి హవా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న సాంగ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu