Karthik Deepam: అన్నంత పనీ చేసిన మోనిత! షాక్ లో కార్తీక్..దీప..!

KVD Varma

KVD Varma |

Updated on: Sep 04, 2021 | 8:12 AM

ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటూ నిరంతరాయంగా సాగిపోతోంది కార్తీకదీపం సీరియల్. ఇప్పటికే 1135 ఎపిసోడ్లను పూర్తిచేసుకున్న కార్తీకదీపం ఈరోజు 1136వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకోండి.

Karthik Deepam: అన్నంత పనీ చేసిన మోనిత! షాక్ లో కార్తీక్..దీప..!
Karthika Deepam Episode 1136

కార్తీక్ ను ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని రాక్షస ప్రయత్నాలు చేస్తోంది మోనిత. అందుకోసం కార్తీక్ కు కడుపునొప్పి వచ్చేలా టీ లో మందు కలిపి ఇచ్చి.. అతన్ని ఆసుపత్రిలో చేరేలా చేస్తుంది. అక్కడకు డాక్టర్ రేణులా ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంది. తనను పెళ్లి చేసుకుంటే కార్తీక్ ను బయటకు తీసుకువస్తాననీ..లేకపోతే జైలులోనే ఉండిపోయేలా చేసి.. కార్తీక్ కుటుంబాన్ని చంపెస్తాననీ బెదిరిస్తుంది. ఒక పక్క కుటుంబం.. మరో పక్క మోనిత బెదిరింపులతో కార్తీక్ కుంగిపోతాడు. ఇక కార్తీక్ పరిస్థితి చూసిన దీప కార్తీక్ తండ్రి ఆనందరావు, తమ్ముడు ఆదిత్యలను తీసుకుని ఆసుపత్రికి వస్తుంది. కార్తీక్ కు ధైర్యం చెప్పాలని అనుకుంటుంది. అయితే, ఈలోపు అక్కడకు వారికంటే ముందుగానే వచ్చిన మోనిత తనకు తాళి అక్కడికక్కడ కట్టమని కార్తీక్ ను బలవంతం చేస్తుంది. తనకు తాళి కట్టకపోతే, కార్తీక్ కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని మళ్ళీ బెదిరిస్తుంది. ఈలోపు అక్కడకు చేరుకున్న దీప వాళ్ళను చూసి.. ”ఇదేమన్నా కుటుంబ పెరేడ్ అనుకున్నారా.. అందరూ ఇలా వచ్చేశారు. కార్తీక్ ఖైదీ.” అంటూ సీరియస్ అవుతుంది. దానికి ఆనందరావు తాము పోలీసుల పర్మిషన్ తీసుకుని వచ్చామని చెబుతాడు. కార్తీక్ మోనిత గురించి చెప్పాలని ప్రయత్నిస్తాడు. అది గమనించిన మోనిత ”మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది.” అని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తుంది కార్తీక్ ను. తరువాత దీపా వాళ్ళను బయటకు వెళ్ళిపోమని చెబుతుంది. ఆతరువాత మళ్ళీ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది. ఇదీ ఇప్పటివరకూ జరిగిన కథ. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరుగబోతోందో తెలుసుకుందాం.

కార్తీక్ ఆసుపత్రిలో మధనపడుతూ ఉంటాడు. అసలు ఏమి జరుగుతోంది. మోనిత గురించి అంత ఎందుకు భయపడుతున్నాను అని తనలో తానే అనుకుంటాడు. తన వలన తన కుటుంబం ఇబ్బంది పడకూడదని భావిస్తాడు. దీపకు చెబితే మరింత ప్రమాదం అని.. తానే ఏదైనా చేయాలని అనుకుంటాడు. మోనితను ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.

టైం లేదు..

అక్కడ మోనిత రామసీతతో మాట్లాడుతూ ఉంటుంది. రామసీత ”మేడం..మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. మీరు ఇవన్నీ వదిలేసి చక్కగా మీ బిడ్డతో ఇదివరకూలానే ఒన్తరిఎగా హాయిగా ఉండొచ్చు కదా? ఈ టెన్షన్ ఎందుకు?” అని అంటుంది. దానికి మోనిత కోపంగా రామసీత వైపు చూసి ”ఈ మాట నువ్వు అన్నవుకాబట్టే సరిపోయింది వేరే ఎవరైనా అని వుంటే ఈపాటికి వాళ్ళను చంపేసే దానిని. కార్తీక్ నా ప్రాణం. కార్తీక్ లేకుండా నేను బతకలేను. నాకు కార్తీక్ గురించి బాగా తెలుసు. అతను తన కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. కుటుంబానికి ఏ ఇబ్బంది రాకూడదు అనుకుంటాడు. అందుకే తనని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. అయితే, కార్తీక్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేలోపు.. కోర్టుకు తీసుకువెళ్ళేలోపు కార్తీక్ నన్ను పెళ్ళిచేసుకునేలా చేయాలి. అందుకోసం తనని స్ట్రాంగ్ గా భయపెట్టాలి.” అంటుంది. అదంతా నేను చూసుకుంటాను.. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెబుతుంది.

నా మీద కూడా నమ్మకం లేదా 

దీప ఆసుపత్రికి వస్తుంది. కార్తీక్ ఆందోళనగా ఉండడం చూసి ఏమి జరిగిందో.. ఎందుకు అలా ఉన్నాడో చెప్పమని గుచ్చి గుచ్చి చెబుతుంది. దానికి కార్తీక్.. ఏమీలేదు అని చెబుతాడు. ”మీరు ఎవరినీ నమ్మడం లేదు. నన్ను కూడా నమ్మడం లేదు అందుకే నిజం చెప్పడం లేదు. మీరు ఇలా ఉన్నారంటే ఎదో బలమైన కారణం ఉంటుంది. నన్ను కూడా నమ్మడం లేదా డాక్టర్ బాబు?” అని ప్రశ్నిస్తుంది దీప. ”అదేమీ లేదు.. నువ్వు అలా మాట్లాడకు. నాకు కొన్ని అనుమానాలున్నాయి. అందుకే అలా ఉన్నాను.” అంటాడు కార్తీక్. ఏమిటి అని అడుగుతుంది దీప. ”పోలీస్ స్టేషన్ కి టీ తీసుకువచ్చిన మూగమ్మాయి మోనిత ఏమో అని అనిపిస్తోంది. రామసీత ఆమె మూగ అమ్మాయి అని చెప్పింది. కానీ గాజు పెంకు గుచ్చుకున్నపుడు ఆమె ఆమ్మా అని అరిచింది అంటాడు కార్తీక్. ”మోనిత అంత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కి వస్తుంది అని అనుకోను డాక్టర్ బాబు” అంటుంది దీప. అదీ నిజమే అని పైకి అన్న కార్తీక్.. నీకు తెలియదు దీపా మోనిత ఎంత దుర్మర్గురాలో అనుకుంటాడు కార్తీక్.

లాయర్ దగ్గరకు 

ఇంటిదగ్గర శ్రావ్య గుమ్మంలోనే ఎదురుచూస్తూ ఉంటుంది. ఆనందరావు వచ్చి ఏమిటమ్మా.. ఆదిత్య కోసమా? అని అడుగుతాడు. అవును మావయ్యా.. లాయర్ గారిని కలిసి వస్తానని వెళ్లారు. ఇంకారాలేదు. అని చెబుతుంది. వచ్చేస్తాడు లేమ్మా.. అక్కడ ఏదైనా ఆలస్యం అయివుంటుంది అంటాడు ఆనందరావు. పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతుంది. వాళ్ళు దీపుతో ఆడుకుంటున్నారు అని చెబుతుంది శ్రావ్య. సరే ఆదిత్య వచ్చిన తరువాత నా దగ్గరకు రమ్మని చెప్పు. లాయర్ గారు ఏమన్నారో తెలుసుకుంటాను అని చెబుతాడు. సరే మావయ్యా అంటుంది శ్రావ్య.

ఆదిత్యను చంపేస్తాను 

కార్తీక్ ఉలిక్కి పడి లేచి నొ అని అరుస్తాడు. దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి ఏమైందండీ అంటుంది. దీపా మన దగ్గరవాళ్ళకు ఎదో అయినట్టు అనిపించింది. అంటాడు. సరిగ్గా అదే సమయానికి వార్డ్ బాయ్ వచ్చి.. డాక్టర్ రేణు మేడం మీతో మాట్లాడతారట అని ఫోన్ ఇస్తాడు. ఫోన్ తీసుకున్న కార్తీక్ తో ”మీ తమ్ముడు అదే మా ముద్దుల మరిదిగారు బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయిందట కార్తీక్. పాపం. నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే దెబ్బలు కాదు ప్రాణాలు పోతాయి. కుటుంబం అంటే నీకు ప్రేమ ఎక్కువకదా.. వాళ్ళను రక్షించుకోవాలంటే రేపు నాకు తాళి కట్టడం ఒక్కటే మార్గం. మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తె..ఈసారి ప్రాణాలు పోతాయి అని బెదిరిస్తుంది. దీప ఏమైంది.. డాక్టర్ మీకు ఎందుకు ఫోన్ చేసింది? అని అడుగుతుంది. దానికి ”నేను ఖైదీ కదా ఎగస్ట్రా కేర్ తీసుకుంటున్నారు. ఏదైనా తేడా వస్తే వల్ల ఉద్యోగాలు పోతాయి.” అని చెబుతాడు కార్తీక్. ఈలోపు దీప ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తిన దీపకు సౌర్య అమ్మా.. బాబాయికి ఏక్సిడెంట్ అయిందట. బైక్ మీద వస్తుంటే పడిపోయాడట.. పిన్ని వెళ్ళింది. మాకు భయం వేస్తోంది. వెంటనే రామ్మా అని అడుగుతుంది. దీంతో దీప షాక్ అవుతుంది. కార్తీక్ కి విషయం చెబుతుంది. దీంతో వెంటనే ఇంటికి వెళ్ళిపొమ్మని చెబుతాడు. దీప బయలుదేరుతుంది. దీప ఇంటికి వచ్చేసరికి ఆదిత్య కట్లతో ఉంటాడు. పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. లాయర్ ఏమన్నారని ఆనందరావు అడుగుతాడు. అక్కడ పిల్లలు ఉన్నారని ఆ విషయాలు తరువాత మాట్లాడుకుందాం అంటాడు ఆదిత్య. మరోవైపు కార్తీక్ జరిగింది తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. మోనిత విషయం ఏమి చేయాలా అని అనుకుంటూ ఉంటాడు.

ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1136)లో జరిగింది. ఇక మోనిత పంతం నెగ్గిందా.. కార్తీక్ కి బెయిల్ దొరికిందా? దీపకు మోనిత గురించి తెలిసిందా? ఇవన్నీ తెలియాలంటే.. సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1137 వరకూ వేచి చూడాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu