AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ 5 షురూ.. హౌస్‏లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..

బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి షూరు కానుంది. దేశ వ్యాప్తంగా ఈ షోకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం

Bigg Boss 5 Telugu:  బిగ్‏బాస్ 5 షురూ.. హౌస్‏లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..
Bigg Boss 5 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2021 | 11:59 AM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి షూరు కానుంది. దేశ వ్యాప్తంగా ఈ షోకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో బుల్లితెరపై బిగ్‏బాస్ షోకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. రేపు 5వ సీజన్ ప్రారంభం కాబోతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ పేర్లు లీకవుతూ వచ్చాయి. అయితే కొత్త కొత్త పేర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రేపు (సెప్టెంబర్ 5న) బిగ్‏బాస్ స్టార్ట్ కాబోతుండడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే లెటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షో రేపు ప్రారంభం కాబోతుండడంతో ఈరోజే కంటెస్టెంట్లను హౌస్‏లోకి పంపుతున్నారు నిర్వహకులు. గత కొద్ది రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారంటైన్‏లో ఉన్న పార్టీసిపెంట్లను ప్రస్తుతం హౌస్‏లోకి ప్రవేశపెడుతున్నారు. ఈ సాయంత్రానికి కంటెస్టెంట్స్ బిగ్‏బాస్ హౌస్ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం బిగ్‏బాస్ ప్రసారం కానుంది. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేదానిపై కూడా స్పష్టత వచ్చేసింది. బిగ్‏బాస్ హౌస్‏లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్.. యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్‏లోకి వెళ్తున్నారు.

అయితే కొత్త లీస్ట్ ప్రకారం నటుడు విశ్వ, సింగర్ శ్రీరామచంద్ర పేర్లు కూడా వినిపించగా.. వారు నిజంగానే హౌస్ లోపలికి వెళ్తున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Liquor Swami Ji: తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..

Actor Haranath: వ్యసనం అలవాటుగా మారితే ఏమవుతుంది.. తొలి తెలుగు అందాల నటుడు హరినాథ్ జీవితమవుతుంది..

రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??
కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??