Liquor Swami Ji: తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు

Surya Kala

Surya Kala |

Updated on: Sep 04, 2021 | 11:12 AM

Liquor Swami ji: తమిళనాడు లో లిక్కర్ స్వామిజి ...మీ భవిష్యత్తు తెలుసుకోవాలా... ఐతే స్వామిజిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసాదాలతో కాదు ... ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే స్వామిజి ప్రసన్నం..

Liquor Swami Ji: తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు
Liquor Swami Ji

Follow us on

Liquor Swami Ji: తమిళనాడు లో లిక్కర్ స్వామిజి …మీ భవిష్యత్తు తెలుసుకోవాలా… ఐతే స్వామిజిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసాదాలతో కాదు … ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే స్వామిజి ప్రసన్నం అవుతారు …. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారిన లిక్కర్ స్వామిజి గురించి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు లోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపం లోని నెమిలి గ్రామంలో ఉన్న స్వామిజి మణి . స్వామిజి పూర్వీకం ఆంధ్ర . ఈ స్వామిజీ  దగ్గరకి తమ భవిష్యత్తుని తెలుసుకోవడానికి వేలాదిగా భక్తులు, ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు . పూజారుల దగ్గరికి ,స్వామీజీల దగ్గరకి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ మణి స్వామిజి దగ్గరకి పురుషులు ఎక్కువ శాతం లో వస్తారు . వారి భవిష్యత్తు ఏంటి, ఆదాయం పెంపు విషయం లో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుంటారు.

పురుషులు అధికసంఖ్యలో ఈ స్వామిజి ని ఆశ్రయించడానికి కారణం ఒక్కటే..  తమిళనాడు లో కొన్ని చోట్ల స్వామిజి మద్యం సేవించి భవిష్యత్తు చెప్తారు కానీ ఈ మణి స్వామిజి స్పెషల్ ఏంటంటే ఎవరైతే తమ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే వారికీ స్వామిజి భవిష్యత్తు గురించి జోశ్యం చెప్తారు. ఈ లిక్కర్ స్వామిజి గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడం తో స్వామిజి ఆశ్రయానికి క్యూ కట్టిన భక్తులు . ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వామిజీ న్యూస్  వైరల్ అయ్యింది.

Also Read: Neem Sticks: మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో ఆన్‌లైన్‌లో పెట్టిమరీ అమ్మకం.. ఒక్కటి ఎంత ధరో తెలిస్తే షాక్..

ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu