Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Sticks: మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో ఆన్‌లైన్‌లో పెట్టిమరీ అమ్మకం.. ఒక్కటి ఎంత ధరో తెలిస్తే షాక్

Neem Sticks in US: పూర్వకాలంలో మన పెద్దలకు ఇటువంటి టూత్ పేస్టులు ఏమీ లేవు.. అయినా వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి.. ఇంకా చెప్పాలంటే.. మన తాతగారు దంతాలు గట్టిగా ఉండి చెరకు..

Neem Sticks: మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో ఆన్‌లైన్‌లో పెట్టిమరీ అమ్మకం..  ఒక్కటి ఎంత ధరో తెలిస్తే షాక్
Neem Sticks #
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2021 | 10:44 AM

Neem Sticks in US: పూర్వకాలంలో మన పెద్దలకు ఇటువంటి టూత్ పేస్టులు ఏమీ లేవు.. అయినా వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి.. ఇంకా చెప్పాలంటే.. మన తాతగారు దంతాలు గట్టిగా ఉండి చెరకు గెడను కూడా ఈజీగా తినేస్తుంటే.. మన తండ్రి.. మనం దంత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అసలు అప్పుడు వారు ఏం వాడారు.. దంతాలు అంత బలంగా ధృడంగా ఉండడానికి అనుకోని వారు అతి తక్కువ.. మరి అప్పటి వారి పళ్ళు అంత ధృడంగా ఉండడానికి సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేపపుల్లలు, ఉత్తరేణి పుల్లలు, పసుపు, ఉప్పు ఇవండీ.. అప్పటి సహజ టూత్ పేస్టులు.. వేప పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయాణాలు ఏమిటో తెలుసా..? ఈ వేపపుల్లతో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకని దీనితో రోజూ దంతాలను తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు నోటి దుర్వాసనని కూడా నివారిస్తుంది. నోటి దుర్వాసన వస్తున్న వారు రోజు వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి.. అయితే ముందుగా వేప పుల్లని బాగా నమిలి.. ఆ రసాన్ని పిక్కిలి పట్టాలి.. తర్వాత పండ్లను తోమాలి.. ఇలా రోజు చేస్తే.. నోటి దుర్వాసన పోతుంది.. సూక్ష్మక్రిములు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే ఆధునికత పేరుతో మన పూర్వకాలం పద్దతులను, అలవాట్లను పక్కకు పెట్టినట్లు.. వేప పుల్లల్ని కూడా పక్కకు పెట్టాం.. పళ్ళు తోముకోవడం కోసం టూత్ పేస్టులు వచ్చాయి. కానీ విదేశీయులు మాత్రం టూత్ పేస్టులను పక్కకు పెట్టి.. వేపపుల్లల బాట పట్టారు. మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో కొనుక్కుని మరీ వాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటే నోరు కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మ‌న దేశంలో ఎక్క‌డికి వెళ్లినా వేప పుల్ల‌లు విరివిగా ల‌భిస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాల్లో వేప‌ పుల్ల‌లు మ‌న‌కు ఎక్క‌డైనా చెట్ల‌కే ల‌భిస్తాయి. ఉచితంగానే అవి అందుబాటులో ఉంటాయి. న‌గ‌రాల్లో అయితే రూ.5 నుంచి రూ.10కి ఒక్కో పుల్ల‌ను విక్ర‌యిస్తారు. అయితే అమెరికాలో మాత్రం ఒక వేప పుల్ల‌ను ఎంతకు విక్ర‌యిస్తున్నారో తెలుసా ? అక్ష‌రాలా రూ.1800. అవును.  అమెరికాలో వేప పుల్ల‌ల‌ను ఆర్గానిక్ టూత్ బ్ర‌ష్‌గా మార్చి ఒక్కో పుల్ల‌ను 24.63 డాల‌ర్ల‌కు అమ్ముతున్నారు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.1800 అన్న‌మాట‌.  వేప పుల్లలను నీమ్ ట్రీ ఫామ్స్ అనే ఈ-కామ‌ర్స్ కంపెనీ విక్ర‌యిస్తోంది. వాటిని సుంద‌రంగా ముస్తాబు చేసిన ప్యాక్‌ లో పెట్టి మరీ అమ్ముతున్నారు.

విదేశీయుల‌కు వేపపుల్ల విలువ తెలిసింది. కనుకనే అంత ధ‌ర పెట్టి మ‌రీ వాటిని కొంటున్నారు. మ‌న‌కు ఉచితంగానే అందుబాటులో ఉన్నా ఆరోగ్యాన్నిచ్చే వేపపుల్లని పక్కకు పెట్టి… అనారోగ్యాలను ఇచ్చే టూత్ పేస్ట్ లను కొని మరీ వాడుతున్నాం.

Also Read: ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..