Taliban: సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్న తాలిబన్లు.. కాలకేయుల అరాచకాలు ఇక షురూ..

Janardhan Veluru

Janardhan Veluru |

Updated on: Sep 04, 2021 | 11:41 AM

Afghan Crisis - Taliban; అంతర్జాతీయ సమాజానికి భయపడి తమలో మార్పు వచ్చినట్లు నటిస్తున్నారు తాలిబన్ రాక్షసులు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇక తమ నిజస్వరూపాన్ని బయటపెట్టనున్నారు.

Taliban: సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్న తాలిబన్లు.. కాలకేయుల అరాచకాలు ఇక షురూ..
Sex Workers (Representative Image)

Afghan Crisis – Taliban: అంతర్జాతీయ సమాజానికి భయపడి తమలో మార్పు వచ్చినట్లు నటిస్తున్నారు తాలిబన్ రాక్షసులు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇక తమ నిజస్వరూపాన్ని బయటపెట్టనున్నారు. మరోసారి అసలుసిసలు కాలకేయుల రాజ్యాన్ని తాలిబన్లు ఆఫ్గన్ల కళ్ల ఎదుట చూపించనున్నారు. మహిళలను జంతువులకంటే హీనంగా చూసే వారి నైజంలో ఎలాంటి మార్పు ఉండబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాసే కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తమ దేశంలోని సెక్స్ వర్కర్ల జాబితాను తాలిబన్లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. షరియా చట్టాల మేరకు వీరికి బహిరంగ మరణశిక్ష విధించే యోచనలో తాలిబన్లు ఉన్నట్లు సమాచారం. లేని పక్షంలో వారిని లైంగిక వెట్టిచాకిరీలుగా వాడుకోవాలన్న యోచనలో తాలిబన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అడల్ట్ సైట్స్‌ సాయంతో తమ దేశంలోని సెక్స్ వర్కర్లను వారు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష వేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో తమ దేశంలో వేశ్యలుగా పనిచేసిన మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. 1996 నుంచి 2001 వరకు ఆఫ్గనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు.. పలువురు సెక్స్ వర్కర్లకు బహిరంగ ప్రదేశాల్లో మరణశిక్ష అమలు చేశారు. తాలిబన్ల పాలనలో సెక్క్ వర్కర్ల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

ఆఫ్గన్‌లో అధికారాన్ని కోల్పోయినా… గత 20 ఏళ్లుగా తాలిబన్లు మహిళలకు వ్యతిరేకంగా తమ అఘాయిత్యాలు కొనసాగించారు. ఇతర పరుషులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను తాలిబన్లు అత్యంత కిరాతకంగా హతమార్చారు.

Also Read..

Whatsapp Accounts: అలాంటి అకౌంట్లపై వాట్సాప్‌ కొరఢా.. 3 మిలియన్‌ల ఖాతాలు బ్యాన్‌..!

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు.. మనీష్‌ నర్వాల్‌కు గోల్డ్‌, సింగ్‌ రాజ్‌కు సిల్వర్‌.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu