Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరిగిన తాలిబన్లు ఆగడాలు.. అప్గన్ల పరుగు.. కాబుల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత..: Kabul Airport closed video.

పెరిగిన తాలిబన్లు ఆగడాలు.. అప్గన్ల పరుగు.. కాబుల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత..: Kabul Airport closed video.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2021 | 9:25 AM

అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. రోజూ వార్తల్లో నిలుస్తోంది కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లడానికి అందుబాటులో ఉన్న వనరు అదొక్కటే కావడం వల్ల వేలాదిమంది ప్రజలు రోజుల తరబడి కాబుల్ విమానాశయం వద్ద పడిగాపులు పడ్డారు.

అఫ్గానిస్తాన్ బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. ఐసిస్-కే ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అంతా ఇంత కాదు. తాలిబన్ల ఆరాచకాలకు బతుకుజీవుడా అన్నట్టుగా దేశం విడిచి వెళ్లిపోతున్నజనం సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఏదోక మార్గంలో దేశం వదిలి వెళ్లేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక విమానం ఎక్కి దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నించిన ఆఫ్ఘన్ పౌరులు.. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.

అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. రోజూ వార్తల్లో నిలుస్తోంది కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లడానికి అందుబాటులో ఉన్న వనరు అదొక్కటే కావడం వల్ల వేలాదిమంది ప్రజలు రోజుల తరబడి కాబుల్ విమానాశయం వద్ద పడిగాపులు పడ్డారు. అదే అదనుగా తీసుకుని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్.. అదే ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహూతిదాడికీ పాల్పడ్డారు. ప్రాణాలకు ఏ మాత్రం గ్యారంటీ లేని పరిస్థితుల్లోనూ అఫ్గనిస్తానీయులు కాబుల్ ఎయిర్‌పోర్ట్‌ను వీడటానికి ఇష్ట పడలేదు. తెగించి అక్కడే రోజుల తరబడి నివసిస్తూ వచ్చారు. అలాంటి కాబుల్ ఎయిర్‌పోర్ట్.. ఇక మూత పడింది. అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిన రెండోరోజే.. ఆ కాబుల్ విమానాశ్రయం నిద్రావస్థలోకి వెళ్లింది.

ఎయిర్ ఎగ్జిట్ పరిస్థితులు మూతపడిన తర్వాత ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్‌గానీ, ఇరాన్‌కుగానీ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశం దాటి వెళ్లేందుకు అవకాశం ఉన్న సరిహద్దుల దగ్గరకు చేరుకుంటున్నారు. మరో దేశానికి వెళ్లి తల దాచుకునేందుకు వేలాది మంది అఫ్గన్ పౌరులు పాక్-ఇరాన్ సరిహద్దు దగ్గరకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటుండటంతో.. ఈ దేశాలు తమ సరిహద్దుల వద్ద భద్రతను కఠినతరం చేశాయి. మరోవైపు, అఫ్గన్ పౌరులెవరూ సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదు. అఫ్గనిస్తాన్‌తో మధ్య ఆసియా దేశాల సరిహద్దులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్‌లోని టోర్ఖామ్ సరిహద్దు వద్ద వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, వేలాది మంది ఆప్ఘాన్లు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అటు, ఇరాన్ ఇస్లాం కలాన్ సరిహద్దులోనూ వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు చేరుకున్నారు. ఇక్కడి నుంచి కొందరు ఇరాన్‌లోకి వెళ్లడంలో విజయం సాధించారు. అమెరికా సేనలు పూర్తిస్థాయిలో ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచి వెళ్లడంతో.. కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడి నుంచి విమాన రాకపోకలు సాగడం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: పర్ ఫ్యూమ్ తాయారు చేయడం ఎలా..? మీకు ఏ పర్ ఫ్యూమ్ సెట్ అవుతుందో తెలుసుకోవచ్చు..: Perfume Video.

ఈ గొర్రెలు పెంచుకుంటే లక్షల్లో ఆదాయం.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం..: Dumba Sheep Video.

నల్లమిరియాలు వాడుతున్నారా అయితే జాగ్రత్త..! ఎందుకో తెలుసా..(వీడియో): Black Pepper Video.

స్మిమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఆవు..! వైరల్ అవుతున్న వీడియో..: Cow Video Viral.