ఈ గొర్రెలు పెంచుకుంటే లక్షల్లో ఆదాయం.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం..: Dumba Sheep Video.
గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం పెంపకందారులకు స్థానిక ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం పెంపకందారులకు స్థానిక ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి పశుపోషణ కూడా ఒక మంచి ఎంపిక అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు తప్పనిసరిగా పశుపోషణలో ఆవు, మేక, పందుల పెంపకం గురించి వినే ఉంటారు. కానీ పశువుల పెంపకానికి మరో మంచి ఎంపిక కూడా ఉంది. వాటిలో దుంబా జాతి గొర్రెల పెంపకం.. అవును ఇది కూడా ఉపాధికి మంచి ఎంపిక. డుంబా పెంపకంలోని ప్రత్యేక విషయం ఏమిటంటే అది బాగా లభాలను ఆర్జించి పెడుతుంది. దుంబా మాంసంకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అలాగే ఇది త్వరగా ఎదుగుతుంది. పశుపోషణ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇది గొప్ప ఎంపిక.
ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన గుడ్డు అన్సారీ గత నాలుగు సంవత్సరాలుగా దుంబా జాతి గొర్రెలను పెంచుతున్నాడు. వీటి పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ప్రతి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు. మొదట్లో కేవలం ఐదు దుంబాలతో గోట్ ఫామ్‌ను ప్రారంభించినట్లుగా చెప్పాడు. వీటిలో నాలుగు ఆడ గొర్రెలను, ఒక పొటేలును తీసుకొచ్చినట్లుగా తెలిపాడు. అవే అతి కొద్ది రోజుల్లోనే వాటి సంతంతిని అభివృద్ధి చేసినట్లుగా వెల్లడించాడు. అతి కొద్ది రోజుల్లోనే తన గోట్ ఫామ్‌లో 60 దుంబాలతో నిండిపోయిందని అన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: నల్లమిరియాలు వాడుతున్నారా అయితే జాగ్రత్త..! ఎందుకో తెలుసా..(వీడియో): Black Pepper Video.
స్మిమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఆవు..! వైరల్ అవుతున్న వీడియో..: Cow Video Viral.
మొదలైన తాలిబన్ల రాక్షస క్రీడ..!మనిషిని హెలికాఫ్టర్ కు ఉరేసిన వీడియో వైరల్..: Taliban Video.