మొదలైన తాలిబన్ల రాక్షస క్రీడ..!మనిషిని హెలికాఫ్టర్ కు ఉరేసిన వీడియో వైరల్..: Taliban Video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Sep 04, 2021 | 8:34 AM

అఫ్గానిస్తాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు దారుణాలకు పాల్పడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి శవాన్ని అమెరికా హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌ ఆకాశంలో విహరించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఫ్గానిస్తాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోస్తున్నారు. 20 ఏళ్ల యుద్ధం ముగియడంతో అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగింది. తాలిబన్లు కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నారు. అయితే ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి వారు కాందహార్‌లో విహరించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే అది తప్పుడు వార్త. మిలియన్ల మంది షేర్‌ చేసిన ఈ వీడియో నిజం కాదని నిర్ధారణ అయ్యింది. ఇది విషాదం కాదని.. సంబురం అని తేలింది. కాందహార్‌లోని గవర్నర్‌ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్‌ మెంబర్‌ ప్రయత్నించాడు. ఫుల్‌ లెంగ్త్‌ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది. కేవలం అక్కడే కాదు.. చాలాచోట్ల జెండాను ఎగరేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సోషల్‌ మీడియాలో.


మరిన్ని ఇక్కడ చూడండి: ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు..!ఏ విధంగానో తెలిసుకోండి మరి(వీడియో): Childrens Online Classes Video.

వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.

దెయ్యం క్రేజీ ,దేవుడు బోర్ అంటున్న ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో)..: RGV Evergreen Video.

Big News Big Debate: దేవుడిపై గోల.. పార్టీల లీల..! బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అభిప్రాయం.. లైవ్ వీడియో.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu