ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు..!ఏ విధంగానో తెలిసుకోండి మరి(వీడియో): Childrens Online Classes Video.

ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు..!ఏ విధంగానో తెలిసుకోండి మరి(వీడియో): Childrens Online Classes Video.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2021 | 7:24 AM

కరోనా తరువాత పిల్లల్లో ఊబకాయం మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్కూల్స్‌ షట్‌డౌన్‌ కావడం. ఆన్‌లైన్‌ క్లాస్‌లతో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం. కరోనా భయంతో పిల్లలను భయటకు తీసుకెళ్లి ఆడించే పరిస్థితి లేదు. దీంతో పిల్లల్లో ఫిజికల్‌ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. అందుకే...

కరోనా తరువాత పిల్లల్లో ఊబకాయం మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్కూల్స్‌ షట్‌డౌన్‌ కావడం. ఆన్‌లైన్‌ క్లాస్‌లతో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం. కరోనా భయంతో పిల్లలను భయటకు తీసుకెళ్లి ఆడించే పరిస్థితి లేదు. దీంతో పిల్లల్లో ఫిజికల్‌ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సంప్రదాయక ఆహార పదార్థాలనే పిల్లలకు అలవాటు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

పిల్లల్లో ఊబకాయం రావడానికి ఆహారపు అలవాట్లు 80శాతం కారణమైతే 20శాతం వారి జీవనశైలి కారణం. ఊబకాయం తగ్గడానికి ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. ఫాస్ట్‌ఫుడ్‌లు, బర్గర్లు, వేపుడ్లు, బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. పిల్లలపై కఠిన ఆంక్షలు పెట్టకుండా అకేషనల్‌గా ఇవ్వొచ్చు. అయితే జంక్‌ ఫుడ్‌ తిన్న తరువాత దానికి తగిన ఫిజికల్‌ యాక్టివిటీ పిల్లల చేత చేయించాలి. ఎక్కువశాతం సంప్రదాయక ఆహార పదార్థాలనే పిల్లలకు అలవాటు చేయడం ఉత్తమం. ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, శాఖాహారం ఇవ్వడం మంచిది.సాధారణంగా పిల్లలు ఏదైనా చూసి నేర్చుకుంటారు. అంటే పెద్దవారు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకని తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌ మోడల్‌గా మారాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, వాకింగ్‌, పిల్లలతో కలిసి ఆటలు ఆడడం చేయాలి. ఆహారం విషయంలోనూ తల్లిదండ్రులు నియమాలు పాటించాలి. పిల్లల ముందు గంటల తరబడి ఫోన్‌లలో చాటింగ్‌ చేయడం, యూట్యూబ్‌ చూడడం, డిజిటల్‌ గేమ్స్‌ ఆడటం చేయకూడదు.


మరిన్ని ఇక్కడ చూడండి: వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.

దెయ్యం క్రేజీ ,దేవుడు బోర్ అంటున్న ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో)..: RGV Evergreen Video.

Big News Big Debate: దేవుడిపై గోల.. పార్టీల లీల..! బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అభిప్రాయం.. లైవ్ వీడియో.

PODCAST Video: దానాలలో ఈ దానం వేరయా..! వెస్ట్ చెయ్యకండి.. దయచేసి దానం చెయ్యండి(వీడియో).