Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేర్‌ డెవిల్‌ వినూత్న డేరింగ్‌ యాక్ట్‌..! చేత్తో తేనె తీయడం ఎప్పుడైనా చూసారా..?: Extracts Honey With Hands Video.

డేర్‌ డెవిల్‌ వినూత్న డేరింగ్‌ యాక్ట్‌..! చేత్తో తేనె తీయడం ఎప్పుడైనా చూసారా..?: Extracts Honey With Hands Video.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2021 | 8:40 AM

తేనెటీగ‌లు అంటేనే కొంద‌రు భ‌య‌ప‌డిపోతారు. ఎందుకంటే అవి కుట్టాయంటే ఒళ్ళంతా వాచి చాలా నొప్పి పెడుతుంది. అందుకే.. తేనెతుట్టెల జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌రు. తేనె సేక‌రించే వాళ్లు మాత్రం తేనెటీగ‌లు కుట్ట‌కుండా సేఫ్టీ మెజ‌ర్స్ వాడతారు. కానీ ఓ వ్య‌క్తి అస‌లు ఏమాత్రం భ‌యం లేకుండా ....

తేనెటీగ‌లు అంటేనే కొంద‌రు భ‌య‌ప‌డిపోతారు. ఎందుకంటే అవి కుట్టాయంటే ఒళ్ళంతా వాచి చాలా నొప్పి పెడుతుంది. అందుకే.. తేనెతుట్టెల జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌రు. తేనె సేక‌రించే వాళ్లు మాత్రం తేనెటీగ‌లు కుట్ట‌కుండా సేఫ్టీ మెజ‌ర్స్ వాడతారు. కానీ ఓ వ్య‌క్తి అస‌లు ఏమాత్రం భ‌యం లేకుండా ఒట్టి చేతుల‌తోనే తేనెను తీశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. తేనెతుట్టెను చూసుకోకుండా.. దాని మీదికి ఏదైనా విసిరేసినా స‌రే.. వెంట‌నే తేనెటీగ‌లు అన్నీ మూకుమ్మ‌డిగా వ‌చ్చి దాడి చేస్తాయి. తేనెటీగ‌ల దాడిలో చ‌నిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అంత దారుణంగా కుడుతాయి అవి. అయితే.. తేనె సేక‌రించే వాళ్లు మాత్రం తేనెటీగ‌లు కుట్ట‌కుండా సేఫ్టీ మెజ‌ర్స్ వాడుతారు. అవి కుట్ట‌డానికి వీలు లేకుండా.. బాడీ మొత్తం ఏదైనా కవ‌ర్ చేసుకొని వెళ్ల‌డం.. లేదా.. తేనెతుట్టె ద‌గ్గ‌ర పొగ‌బెట్ట‌డం లాంటివి చేసి తేనె తీస్తుంటారు.

కానీ.. ఈ వ్య‌క్తిని చూడండి.. అస‌లు.. ఏమాత్రం భ‌యం లేకుండా.. ఒట్టి చేతుల‌తోనే తేనెను తీశాడు. తేనెటీగ‌ల‌ను ప‌ట్టుకున్నా కూడా అత‌డికి ఏం కాలేదు. అయితే..తేనెటీగ‌ల‌ను పెంచి.. వాటికి తేనెతుట్టెల‌ను ఏర్పాటు చేసి కూడా కొంద‌రు తేనెను సేక‌రిస్తుంటారు. అటువంటి తేనెటీగ‌లు అయితే.. స‌హ‌జంగా అడ‌వుల్లో ఉండే తేనెటీగ‌ల్లా కుట్ట‌వు అని కొంద‌రు అంటున్నారు.. కానీ.. ఒట్టి చేతుల‌తో ఏమాత్రం భ‌యం లేకుండా.. తేనెతుట్ట‌ను ముట్టుకోవ‌డం అనేది మాత్రం నిజంగా డేర్‌ స్టెప్పే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో రెడిట్‌లో వైర‌ల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: మొదలైన తాలిబన్ల రాక్షస క్రీడ..!మనిషిని హెలికాఫ్టర్ కు ఉరేసిన వీడియో వైరల్..: Taliban Video.

ఆన్‌లైన్‌ క్లాసులతో లావెక్కుతున్న చిన్నారులు..!ఏ విధంగానో తెలిసుకోండి మరి(వీడియో): Childrens Online Classes Video.

వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.

దెయ్యం క్రేజీ ,దేవుడు బోర్ అంటున్న ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో)..: RGV Evergreen Video.