Whatsapp Accounts: అలాంటి అకౌంట్లపై వాట్సాప్‌ కొరఢా.. 3 మిలియన్‌ల ఖాతాలు బ్యాన్‌..!

Whatsapp Accounts: ఈ ఏడాది జూన్‌ - జూలై మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది..

Whatsapp Accounts: అలాంటి అకౌంట్లపై వాట్సాప్‌ కొరఢా.. 3 మిలియన్‌ల ఖాతాలు బ్యాన్‌..!
Follow us

|

Updated on: Sep 04, 2021 | 10:45 AM

Whatsapp Accounts: ఈ ఏడాది జూన్‌ – జూలై మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి  ఖాతాలను నిషేదించినట్లు వాట్సాప్ తెలిపింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందుకున్న మెయిల్స్ ఆధారంగా ఈ మెసేజింగ్ ఫ్లాట్ ఫారంలో హానికరమైన సమాచారాన్ని అరికట్టడం కోసం ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ఖాతాలను నిషేదించింది.

కొత్త ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా వాట్సాప్ తన యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం జూన్ 16 – జూలై 31 మధ్య 46 రోజుల వ్యవధిలో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా, అలాగే తన స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ వెల్లడించింది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. తప్పుడు సందేశాల కారణమవుతున్న అకౌంట్లను తొలగించడం జరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏదైనా గ్రీవియెన్స్ కోసం మమ్మల్ని సంప్రదించాలంటే యూజర్లు wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని తెలిపింది.

కాగా, ఫేక్‌ న్యూస్‌, హానీకరమైన సమాచారం, అనుచిత సమాచారం వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఇలాంటివి వాట్సాప్‌లో ఎన్నో మెసేజ్‌లు చక్కర్లు కొడుతుండటంతో వాట్సా్‌ప్‌ అలాంటి వారి ఖాతాలను తొలగించే పనిలో పడింది. ప్రత్యేక టెక్నాజలీ ద్వారా ఇలాంటి పోస్టులు చేస్తున్న వారి ఖాతాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Wireless Charging: మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఇతర పరికరాలు గాలి ద్వారానే చార్జింగ్‌.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ

Solar Storm: అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. భూమికి పొంచివున్న ముప్పు.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.