Dry Amla Benefits: ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..

Dry Amla Benefits: ఉసిరిని హిందూమతంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఉసిరి ఔషధాల గని. ఆయుర్వేద వైద్యంలో  ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనిలో దానిమ్మ పండు కంటే 17 రెట్లు..

Dry Amla Benefits: ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..
Dry Amla
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2021 | 10:16 AM

Dry Amla Benefits: ఉసిరిని హిందూమతంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఉసిరి ఔషధాల గని. ఆయుర్వేద వైద్యంలో  ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనిలో దానిమ్మ పండు కంటే 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ శక్తి ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ చవకైన అద్భుత ఆహారం ఉసిరి.  ఈ ఉసిరిని పచ్చడిగా , రైస్ తో పాటు పచ్చిగా కూడా తింటారు. అయితే ఉసిరిని ఎండబెట్టి తింటే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉసిరిని ఎండబెట్టిన ముక్కలుగా లేదా ఉసిరి పొడిగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని భోజనం తర్వాత రెండు ముక్కలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

గొంతు నొప్పి , జలుబును నయం చేస్తుంది:

ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న సమయంలో  రెండు టీస్పూన్ల ఉసిరి పొడిని , రెండు టీస్పూన్ల తేనెతో కలిపి.. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే.. మంచి ఫలితం ఇస్తుంది.  గొంతునొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

 మలబద్దకాన్ని తగ్గిస్తుంది:

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఉసిరి మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది.

నోటి పూతను నయం చేస్తుంది: 

ఉసిరి పొడిని వాటర్ లో కలిపి తీసుకోవచ్చు. లేదా ఉసిరి రసాన్ని అరకప్పు నీటిలో వేసి.. ఆ నీటితో పుక్కిలి పడితే.. నోటి పూతనుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆర్థరైటిస్ నొప్పులను నివారిస్తుంది: 

ఆర్థరైటిస్ సంబంధిత నొప్పిని తగ్గించడంలో ఉసిరి మంచి సహాయకారి. ఎండిన ఉసిరిని రోజూ రెండు చొప్పున తినండి. ఆరోగ్య రక్షణలో అద్బుతంగా పని చేస్తుంది.

కఫాన్ని తగ్గిస్తుంది. 

తేనె , ఎండిన ఉసిరిని తీసుకోవడం వలన శరీరంలో కఫ దోషాలను తగ్గించుకోవచ్చు.

ఒత్తైన జుట్టుకు ఉసిరి పౌడర్:

జుట్టుకు అత్యంత పోషకమైన మూలికల్లో ఉసిరి ఒకటి. ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టుకు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. ఉసిరి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను పెంచుతుంది.. దీంతో జుట్టు ఒత్తుగా పెరగడానికి కారణమవుతుంది.

మెరిసే చర్మం కోసం ఉసిరి:

ఉసిరికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎండబెట్టిన ఉసిరిని రోజూ తీసుకోవడం వలన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అంతేకాదు  కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మురబ్బా, ఊరగాయలు లేదా క్యాండీలుగా తినండి.  ఏ రూపంలోనైనా ఉసిరిని రోజూ రోజూ రెండు ముక్కలు తినండి. ఆరోగ్యంగా ఉండండి.

Also Read:  వ్యసనం అలవాటుగా మారితే ఏమవుతుంది.. తొలి తెలుగు అందాల నటుడు హరినాథ్ జీవితమవుతుంది..