Actor Haranath: వ్యసనం అలవాటుగా మారితే ఏమవుతుంది.. తొలి తెలుగు అందాల నటుడు హరినాథ్ జీవితమవుతుంది..

Actor Haranath: ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో , స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు. అదే మనిషి.. జీవితంలో..

Actor Haranath: వ్యసనం అలవాటుగా మారితే ఏమవుతుంది.. తొలి తెలుగు అందాల నటుడు హరినాథ్ జీవితమవుతుంది..
Harinath

Actor Haranath: ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో , స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు. అదే మనిషి.. జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి.. వృత్తిని నిర్లక్ష్యం చేసి, డబ్బుని వృధా చేస్తే.. వారి జీవితం అస్తవ్యస్తమవుతుంది. అందుకు ఉదాహరణగా చరిత్రలో ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు అలనాటి అందాల హీరో హరినాథ్. చేసే వృత్తిని ప్రేమించాలి. వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది. తొలి తెలుగు అందాల హీరో హరనాథ్ జీవితం అవుతుంది.

హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం.. ఆచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హరనాథ్.. నిజంగా హరనాథ్ అందగాడు. ఎంత అందగాడు అంటే.. రోడ్డు మీద వెళ్తున్న హరినాథ్ చూసి.. ఒక నిర్మాత పిలిచిమరీ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు. చెన్నై నగరంలో హరినాథ్సి ను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగి మరీ గుత్తా రామినీడు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. దీంతో 1959లో  “మా ఇంటి మహాలక్ష్మి” సినిమాలో హీరోగా హరనాథ్ వెండి తెరపై అడుగు పెట్టాడు.

ఇక ఎన్టీఆర్ కే సొంతమనుకున్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో సాయిరాం హరనాథ్‌ నటించి మెప్పించాడు.  ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హరినాథ్ ను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ..  శ్రీరామునిగా హరనాథ్ మెప్పించారు.  భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరనాథ్‌కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ తరువాత స్థానం హరనాథ్‌దే అని స్థిరపడిపోయింది. సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరనాథ్‌కు అభిమానులుగా మారిపోయారు. 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలో హరనాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు.. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీ కృష్ణ, అమర శిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. జమున హరనాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు జమున పై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో జమున, హరనాథ్‌ల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

అయితే హరినాథ్ సినిమా కెరీర్ మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయాడు. కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు. ఎస్‌వి రంగారావు, హరనాథ్‌ల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్.. ఇద్దరూ గొప్ప నటులే. నటనలో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరూ  వ్యసనంలో పోటీ పడ్డారు. దీంతో హరినాథ్ కు సినిమా ఛాన్స్ ఇస్తే.. ఆ సినిమా షూటింగ్‌కు వస్తారో? రారో తెలియదు. వస్తే మద్యం మత్తులో వస్తారో, మామూలుగా వస్తారో తెలియదు. అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి. దీంతో హరనాథ్ కు మెల్లగా అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో హరనాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు. అంత అందమైన రూపం ఉండి ఏం లాభం. హరనాథ్‌కు కొద్ది పాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు.

హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హరనాథ్ వరస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్ కు చేరుకున్నారు. అయితే వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకుని బతకడానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ నటించారు. అదే హరినాథ్ చివరి సినిమా.
సెప్టెంబర్ 2, 1936లో తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాధరాజు. హరనాథ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరనాథ్ కుమారుడే. ఒక వ్యసనం 53 ఏళ్ల ప్రాయంలోనే నవంబర్ 1, 1989లో హరనాథ్ కన్ను మూశారు. వ్యసనాన్ని ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు ..అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే.. ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు.. ఆ ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితనాన్ని అయినా కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హరినాథ్ జీవితం.

 

Also  చెప్పుడు మాటలకు కేరాఫ్ అడ్రస్.. మంథర.. రాముడిని 14 ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటో తెలుసా..

 

 

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu