- Telugu News Photo Gallery Cinema photos Bigg boss telugu know these contestants are rivalries from previous seasons mumaith khan and shivabalaji to abhijeeth and akhil
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ గత సీజన్లలో శత్రువులుగా మారినవాళ్ళు వీరే.. హౌస్‌లో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..
బిగ్‌బాస్ 5 తెలుగు: బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన షో బిగ్‌బాస్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళ భాషలలో ఈ షో దూసుకుపోతుంది. అయితే ఇందులో ఎంటర్టైన్మెంట్తోపాటు.. వివాదాలు కూడా ఎక్కువే. స్నేహితులుగా ఉండి.. బిగ్‌బాస్ హౌస్‌లో శత్రువుగా మారిన వారి గురించి తెలుసుకుందామా.
Updated on: Sep 04, 2021 | 1:48 PM

ముమైత్ ఖాన్.. 2017లో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తొలి సీజన్లో పాల్గొంది. ముమైత్ ఖాన్ ఎక్కువగా హౌస్‌లో ఉన్న అందరూ కంటెస్టెంట్స్‌తో గొడవలు జరుగుతుండేవి. రోల్ ప్లే టాస్క్‌లో ప్రిన్స్, శివబాలాజీతో జరిగిన పోటీతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సీజన్ 2లో కౌశల్, తనీష్ ఇద్దరు ఎప్పుడూ శత్రువులుగా ఉండేవారు. వేరు వేరు గ్రూపులుగా విడిపోయి మరీ గొడవలు పెట్టుకున్నారు. అయితే బిగ్‌బాస్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య శత్రుత్వం కొనసాగింది.

ఇక సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మంచి స్నేహితులు అయిన్.. హౌస్‌లో పరిణమాలతో పూర్తి శత్రువులుగా మారారు. వ్యక్తిగత కామెంట్స్ సైతం చేసుకున్నారు. దీంతో సీజన్ మొత్తానికి రాహుల్‌ను నామినేట్ చేస్తూనే ఉంటా అని శ్రీముఖి ప్రకటించింది.

అలాగే ఇదే సీజన్లో తమన్నా సింహాద్రి, సీరియల్ హీరో రవికృష్ణ మధ్య పోటీ ఎక్కువగానే ఉండేది. తమన్నా సింహాద్రినియ.. రవికృష్ణ నామినేట్ చేసినందుకు అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతడిని విపరీతంగా రెచ్చగొట్టింది. అతనిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. మానసిక ఒత్తిడికి గురిచేసింది.

ఇక సీజన్ 4లో హీరో అభిజిత్, అఖిల్ మధ్య మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. మోనాల్ గజ్జర్ కారణంగా వీరిద్దరి వ్యక్తిగతంగా దూషించుకున్నారు. గొడవను నాగార్జున పరిష్కరించినా... సిక్రెట్ రూం తర్వాత వీరిద్ధరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది

అలాగే ఇదే సీజన్లో సోహెల్, అరియానా మధ్య కూడా శత్రుత్వం పెరిగింది. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత వీరిద్దరి తరచూ గొడవ పడుతూ వచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరి మధ్య గొడవ పెద్దగా జరిగినా.. ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ ఫైట్‌గా అనిపించేది.





























