Kichcha Sudeepa: సుదీప్ బర్త్ డే.. రెచ్చిపోయిన ఫ్యాన్స్… దున్నపోతు బలి.. నెత్తుటితో

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 04, 2021 | 3:50 PM

సినిమా హీరోలపై అభిమానం హద్దులు దాటుతోంది. వేడుక ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటున్నారో..ఏమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అభిమానం పేరుతో...

Kichcha Sudeepa: సుదీప్ బర్త్ డే.. రెచ్చిపోయిన ఫ్యాన్స్... దున్నపోతు బలి.. నెత్తుటితో
Sudeep Birthday

Follow us on

సినిమా హీరోలపై అభిమానం హద్దులు దాటుతోంది. వేడుక ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటున్నారో..ఏమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అభిమానం పేరుతో వీరంగం సృష్టిస్తున్నారు. చివరకు ఫ్యాన్స్‌ హంగామాతో హీరోలు విమర్శల పాలవుతున్నారు. ఒకేరోజు ఇద్దరు హీరోల పుట్టినరోజు వేడుకలు కాంట్రవర్సీకి దారితీశాయి. సెప్టెంబర్‌ 2..ఇటు పవన్‌ కల్యాణ్‌..అటు కిచ్చా సుదీప్‌..బర్త్‌డే సెలట్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుపుకున్నారు ఫ్యాన్స్‌. ఐతే ఏపీ పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై రచ్చ జరుగుతోంది. మరోవైపు కర్ణాటక బళ్లారిలో కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చ సుదీప్‌ పుట్టినరోజు వేడుకలపైనా మండిపడుతున్నారు జంతు ప్రేమికులు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం ప్రాథమిక పాఠశాలలో పవన్ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో జనసేన జెండా పట్టించి హ్యాపీ బర్త్‌డే పవన్‌ అంటూ నినాదాలు చేయించడంపై పలువురు ఫిర్యాదు చేశారు. సర్కారీ బడిలో పవన్‌ నినాదాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు MEO.

ఇక కర్ణాటక బళ్లారిలో సుదీప్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా కాంట్రవర్సీకి దారితీశాయి. కిచ్చా సుదీప్‌ భారీ పోస్టర్‌ పెట్టిన ఫ్యాన్స్‌..ఆ పోస్టర్‌ ముందు దున్నపోతును బలిచ్చారు. తమ అభిమాన నటుడికి బలిచ్చామంటూ సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల పుట్టినరోజైతే మాత్రం ఇలా జంతువులను బలిస్తారా అని నిలదీస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  జంతు బలిని చాలా మంది వ్యతిరేకిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు దున్నపోతును బలి ఇవ్వడం వివాదానికి కారణం అయ్యింది.

Sudeep

కన్నడ స్టార్ హీరో సుదీప్ గురించి సినీ అభిమానులకు స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల నటి శ్రీదేవి తదితరుల స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన సుదీప్ కు భారతేదశ సినీరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా సుదీప్ ఫ్రూవ్ చేసుకున్నాడు.

Also Read: పంచ్‌లకు పోయిన ప్రాణం… 18 ఏళ్లకే ముగిసిన జీవితం.. బాక్సింగ్ బ్యాన్ చేయాలని డిమాండ్

 హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu