Boxer Death: పంచ్‌లకు పోయిన ప్రాణం… 18 ఏళ్లకే ముగిసిన జీవితం.. బాక్సింగ్ బ్యాన్ చేయాలని డిమాండ్
గత శనివారం మాంట్రియల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్‌లో గాయపడింది జెన్నెట్. ప్రత్యర్థి మ్యారీపెయిర్ హులేతో జరిగిన పోరులో గాయపడింది.
బాక్సింగ్ ఓ సాహస క్రీడ.. ఇప్పుడీ గేమ్ ప్రాణాంతకంగా మారింది.. విజయం సాధిస్తే అంతులేని ఆనందం.. ఓడిపోతే నైరాశ్యం.. అయితే బాక్సింగ్‌లో ప్రత్యర్థి విసిరిన పంచ్‌లకు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తోంది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్‌లో ప్రత్యర్థి పంచ్‌లకు గాయపడి ఓ బాక్సర్ మృతి చెందడం విషాదాన్ని నింపింది. అంతేకాదు బాక్సింగ్‌ను నిషేధించాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజుల క్రితం కెనడాలోని మాంట్రియల్‌లో ఇంటర్నేషన్ బాక్సింగ్ ఈవెంట్ జరిగింది. మెక్సికో దేశానికి చెందిన 18 ఏళ్ల జెన్నెట్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంది. అతి చిన్న వయసులోనే బాక్సింగ్‌లో రాణిస్తూ ఇంటర్నేషనల్ ఈవెంట్ వరకు వచ్చింది. అయితే ప్రత్యర్థి విసిరిన పంచ్‌లకు తట్టుకోలేక విలవిల్లాడిపోయింది. తీవ్రంగా గాయపడి చివరికి మృత్యువాత పడింది.
గత శనివారం మాంట్రియల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్‌లో గాయపడింది జెన్నెట్. ప్రత్యర్థి మ్యారీపెయిర్ హులేతో జరిగిన పోరులో గాయపడింది. నాలుగో రౌండ్‌లో మ్యారీ కొట్టిన అప్పర్ కట్ షాట్‌కి జెన్నెట్ ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయింది. గాయపడిన తర్వాత కూడా రెండు రౌండ్ల వరకు పోరాడింది. అయితే ఫైనల్ రౌండ్‌లో మ్యారీ కొట్టిన పంచ్‌కి జెన్నెట్ మౌత్‌గార్డ్ బయటకు వచ్చేసింది. గేమ్ ముగిసిన వెంటనే తీవ్రగాయాలైన జెన్నెట్‌ను వెంటనే స్ట్రెచర్‌పై దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది జెన్నెట్.
మ్యారీ కొట్టిన పంచ్‌లతో జెన్నెట్ తలకు తీవ్రగాయాలై రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఐదు రోజుల పాటు జెన్నెట్‌ను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం విఫలమైంది. మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది జెన్నెట్. దీంతో బాక్సింగ్‌ను నిషేధించాలనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
¡Oremos ?? por nuestra paisana Jeanette Zacarías Zapata que se encuentra en condición MUY grave!#boxeo #boxing #tragedia #boxeadorea #npjboxeo pic.twitter.com/UgIGUdcxX7
— No Puedes Jugar Boxeo (@NPJBoxeo) August 29, 2021
బాక్సింగ్ పంచ్‌లకు తీవ్రంగా గాయపడి గతంలో కూడా చాలా మంది చనిపోయారు. 2019 జులైలో 28 ఏళ్ల రష్యన్ బాక్సర్ మాక్సిమ్ డడ్‌షేవ్ మృతి చెందాడు. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఆక్సెన్ హిల్స్ థియేటర్‌లో సూపర్ లైట్ వెయిట్ ఫైట్‌లో పంచ్ దెబ్బలకు తట్టుకోలేక మృతి చెందాడు. 13 రౌండ్ల పాటు జరిగిన పోరులో పంచ్ దెబ్బలకు మెదడులో నరాలు చిట్లి మృతి చెందాడు. 2008 జనవరిలో కూడా దక్షిణ కొరియాకు చెందిన బాక్సర్ చోయెసామ్ మృతి చెందాడు. రింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెయిన్ సర్జరీ చేసినా ఫలితం లేకుండాపోయింది. 2008 అక్టోబర్‌లో మెక్సికన్ బాక్సర్ డానియల్ అగులోన్ రింగ్ లో గాయపడి చనిపోయాడు. ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చనిపోయాడు. 2005లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ లెవాండర్ జాన్సన్ రింగ్‌లో గాయపడి చనిపోయాడు. 2003 జులైలో రింగ్‌లోనే కుప్పకూలి అమెరికాకు చెందిన బ్రాడ్ రోనే అనే బాక్సర్ చనిపోయాడు. 2002 జూన్‌లో పనామనియన్‌కు చెందిన బాక్సర్ పెడ్రో అల్‌కజర్ లాస్‌వెగాస్‌లో మృతి చెందాడు.
దీంతో ప్రాణాంతకమైన బాక్సింగ్ క్రీడను రద్దు చేయాలని గతంలోనే పలువురు హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడు మెక్సికన్ బాక్సర్ జెన్నెట్ మృతితో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
Also Read: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు