‘ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకు?’… ఏపీ సర్కార్‌పై బీజేపీ ఫైర్

కరోనా దృష్ట్యా విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించింది.

'ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకు?'... ఏపీ సర్కార్‌పై బీజేపీ ఫైర్
Ap Ganesh Festival
Follow us

|

Updated on: Sep 04, 2021 | 2:53 PM

చవితి ఉత్సవం రాజకీయం వివాదంగా టర్న్ తీసుకుంది. అవును.. ఏపీలో వినాయక చవితి పండుగ రాజకీయ వివాదానికి దారితీసింది. కరోనా దృష్ట్యా విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు వ్యాక్సిన్‌ వేస్తూ, మరోవైపు కరోనా తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఆంక్షలపై ఏకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు పురంధేశ్వరి. ప్రభుత్వం మాత్రం ఆంక్షలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. వినాయక చవితిని ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని, కరోనా ఆంక్షలను పాటించాల్సిందేనని సూచించారు.

వినాయక చవితిపై అసలు ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఏంటంటే..

వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు కూడా ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది ఆప్తులను కోల్పోయామని.. తెలిసి మళ్లీ తప్పులు చేయవద్దన్నది ఏపీ సర్కార్ వెర్షన్. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో ఆంక్షలకు ప్రజలు కూడా సహకరించాలని సీఎం జగన్ కోరారు. తొలి నుంచి కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెప్తూ వస్తున్న సీఎం జగన్.. నియమ, నిబంధనలు పాటిస్తే వ్యాధి వ్యాప్తిని, డ్యామేజ్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

Also Read: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

 ‘క్యా సీన్ హై’.. పారాలింపిక్స్‌లో లవ్‌ ప్రపోజల్‌.. ఆమె ఏం చెప్పిందంటే