Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics: ‘క్యా సీన్ హై’… పారాలింపిక్స్‌లో లవ్‌ ప్రపోజల్‌.. ఆమె ఏం చెప్పిందంటే

టోక్యో పారాలింపిక్స్​లోఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. 200 మీటర్ల పరుగుపందెం పోటీ.. సెమీఫైనల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్​ చివర్లో ఓడిపోయినా....

Tokyo Paralympics: 'క్యా సీన్ హై'... పారాలింపిక్స్‌లో లవ్‌ ప్రపోజల్‌.. ఆమె ఏం చెప్పిందంటే
Guide Surprises Paralympic Sprinter
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 04, 2021 | 1:48 PM

టోక్యో పారాలింపిక్స్​లో ఓ ఇంట్రస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. 200 మీటర్ల పరుగుపందెం పోటీలో.. కేయులా నిద్రియా పెరీరా అనే చూపులేని స్ప్రింటర్‌ సెమీఫైనల్స్‌ క్వాలిఫైంగ్‌ రౌండ్‌లో చివర్లో ఓడిపోయింది. అయినా సరే ఆమె ఏమీ ఒట్టి చేతులతో అక్కడి నుంచి వెళ్లడం లేదు. అదేంటి మెడల్ గెలువకపోయినా.. ఏమీ సాధించింది అనేగా మీ డౌట్?. బహుశా ప్రజల మనసులు గెలిచి ఉంటుంది అని అనుకుంటున్నారా. అయితే మీరు పప్పలో కాలేసినట్టే. ఆ ఒలింపిక్‌ గడ్డ అందరికీ గెలుపోటముల అనుభవాలను ఇస్తే.. ఆమెకు మాత్రం లైఫ్ పార్టనర్‌ను ఇచ్చింది. టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోవడంతో పెరీరా చాలా డిసప్పాయింట్ అయ్యింది. అప్పుడే తన వద్దకు వచ్చాడు కోచ్‌(గైడ్) మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా. అందరూ ఆమెను అతడు ఓదార్చుతాడేమో అనుకున్నారు. కానీ అక్కడి ఊహించని సీన్ సాక్షాత్కరించింది. కోచ్ మోకాళ్ల మీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. దానికామె ‘యస్’ చెప్పడంతో ఆనందాలు వెళ్లి విరిశాయి. దీంతో   ఒక్కసారిగా అక్కడ ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. ఈ సర్‌ప్రైజ్‌ లవ్‌ ట్రాక్‌ను టోక్యో 2020 పారాఅథ్లెటిక్స్‌ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి’ అంటూ ట్వీట్‌ చేసింది. నెటిజన్లు వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. వారిద్దరకీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే అథ్లెట్‌గా మారిన కేయులా నిద్రియాను 2012లో ఆఫ్రికాలోని కేప్‌ వర్డే ప్రభుత్వం స్పోర్ట్స్‌ మెరిట్ మెడల్‌తో సత్కరించింది. తాజాగా పారాలింపిక్స్‌ సెమీఫైనల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్​ చివర్లో ఓడిపోయినా జీవిత భాగస్వామిని సంపాదించింది స్ప్రింటర్ కేయులా నిద్రియా పెరీరా.

గైడ్ ప్రపోజ్ చేసిన చేసిన వీడియో దిగువన చూడండి

Also Read: ఐఫోన్‌తో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడుకు.. ఆయన తండ్రి రెస్పాన్స్ వింటే మీరు షాకవుతారు

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌