Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాడ్ షూట్ లీక్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

Mahesh Babu: బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాడ్ షూట్ లీక్..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 3:38 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ ఆరు అడుగుల అందగాడికి అంతులేని అభిమాన గణం ఉంది. ఇక మహేష్ సినిమాలతోపాటు వాణిజ్యప్రకటనల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే థాంసప్ యాడ్‌లో మహేష్ నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు చాలా యాడ్స్‌లో మహేష్ నటించారు. ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి ఓ యాడ్ చేశాడు మహేష్. ఇక ఇప్పుడు మరో యాడ్ షూట్‌లో మెరిశాడు. పాన్ బహార్ ఇలాచీ కోసం మహేష్ ఓ యాడ్ చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ సతీమణి నమృత ఈ షూట్‌కి సంబంధించిన ఫోటోలను, ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో మహేష్ న్యూ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ యాడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా కనిపించనున్నాడట. ఇప్పటికే మహేష్ బాబు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ మహేష్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. మహేష్ – రణ్ వీర్ కలిసి థమ్స్ అప్ యాడ్‌లో కలిసినటించారు. ఇక ఇప్పుడు టైగర్ మహేష్‌తో కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపించనున్నాడు. తాజాగా మహేష్- టైగర్ ష్రాఫ్ పై షూట్ చేస్తున్నారు. ఇక టైగర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటే.. మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. Mahesh

మరిన్ని ఇక్కడ చదవండి : 

చీరలో పడుచు సోయగం.. ఆకట్టుకుంటున్న అనసూయ న్యూ ఫొటోస్..: Anasuya Bharadwaj Photos.

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న జనసేనాని.. కిన్నెర కళాకారుడు మొగులయ్యకు ఆర్థిక సాయం