ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

Cricket News: క్రికెట్‌లో థ్రిల్‌ అంటే అందరు ట్వంటీ 20 మ్యాచ్‌ల గురించి ఆలోచిస్తారు. కానీ నిజమైన థ్రిల్ అంటే టెస్ట్ మ్యాచ్‌లో ఉంటుంది. ఇంగ్లాండ్ కౌంటీ

ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
Yorkshire Vs Hampshire

Cricket News: క్రికెట్‌లో థ్రిల్‌ అంటే అందరు ట్వంటీ 20 మ్యాచ్‌ల గురించి ఆలోచిస్తారు. కానీ నిజమైన థ్రిల్ అంటే టెస్ట్ మ్యాచ్‌లో ఉంటుంది. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ చూస్తే కచ్చితంగా ఇది నిజమని నమ్ముతారు. ఇది యార్క్‌షైర్ వర్సెస్‌ హాంప్‌షైర్ మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కనిపించే ఓ చిత్రం టెస్ట్ క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది.

యార్క్‌షైర్ వర్సెస్‌ హాంప్‌షైర్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రా అయింది. కానీ ఈ మ్యాచ్‌ గెలవడానికి ఇరుజట్లు చాలా ప్రయత్నించాయి. యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా హాంప్‌షైర్ మొదటి ఇన్నింగ్స్ 163 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో యార్క్‌షైర్ 80 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తర్వాత యార్క్ షైర్ తమ రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లకు 312 వద్ద డిక్లేర్ చేసింది. హాంప్ షైర్ ముందు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంప్‌షైర్ 177 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకుంది. ఆట చివరి రోజు ఇంకా కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. యార్క్‌ షైర్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. అయితే 9 వికెట్లు సాధించిన యార్క్ షైర్ జట్టు చివరి వికెట్ మాత్రం పడగొట్టలేకపోయింది. ఫలింతంగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కానీ లాస్ట్ వికెట్ సాధించడానికి యార్క్ షైర్ జట్టు బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఫీల్డర్లను మోహరించిన తీరు టెస్ట్ క్రికెట్‌లో అరుదుగా జరుగుతుంది. ఈ చిత్రం చూస్తే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

GST: అప్పడాలపై జీఎస్టీ ఎంతో మీకు తెలుసా? పాపడ్ ఆకారాన్ని బట్టి జీఎస్టీ ఉంటుందా? అప్పడాలు.. జీఎస్టీ..మధ్యలో వైరల్ ట్వీట్!

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,502 కరోనా కేసులు.. ప్రమాదకరంగా పెరిగిన మరణాలు

Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో ప్రమోద్‌ భగత్‌ సంచలనం.. స్వర్ణంతో మురిసిన భారత బ్యాడ్మింటన్‌!

Click on your DTH Provider to Add TV9 Telugu