ఆదుకునే అంబులెన్స్‌కే ఆరోగ్యం పాడైతే.. ఎవరు సాయం చేశారో చూడండి..
మామూలుగా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీలో ఆరోగ్యం బాగోలేక అత్యవసరంగా హాస్పిటల్‌కి వెళ్లాలంటే 108కి డైల్ చేసి అంబులెన్స్ హెల్ప్ చేసుకుంటారు.
మామూలుగా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీలో ఆరోగ్యం బాగోలేక అత్యవసరంగా హాస్పిటల్‌కి వెళ్లాలంటే 108కి డైల్ చేసి అంబులెన్స్ హెల్ప్ చేసుకుంటారు. మరి అంబులెన్స్‌కి బాగోలేనప్పుడు ఎవరి సాయం తీసుకోవాలి. మనుషులకు బాగోలేనప్పుడు మాత్రమే అంబులెన్సులు కాదు.. అంబులెన్స్ కు బాగా లేనప్పుడు కూడా 108 కాల్ చేయాలా. ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తోంది. నగరంలోని మలక్ పేట్‌లోని చదర్గాట్ రైల్వే బ్రిడ్జి కింద ఒక అంబులెన్స్‌కి ఆరోగ్యం పాడైంది. అంబులెన్స్ ఆరోగ్యం పాడవ్వడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా… అదేనండి అంబులెన్స్‌కి సడన్‌గా రీపైర్ వచ్చి నడిరోడ్డు మీద ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కానీ డ్రైవర్ ఇంకో అంబులెన్స్‌కి కాల్ చేశాడు. దీంతో అంబులెన్స్ వచ్చి చెడిపోయిన వాహనాన్ని వాహనానికి ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేశాడు ఆ డ్రైవర్. అయినా ఫలితం లేకపోవడంతో పేషెంట్లను ఎలాగైతే హాస్పిటల్‌కి తీసుకు వెళుతుందో అలాగే ఆ అంబులెన్స్ కూడా చెడిపోయిన ఇంకో అంబులెన్స్‌ను తాడు సాయంతో లాక్కెళ్ళింది. ఇది చూసిన అక్కడి వారంతా అంబులెన్స్‌కి పాడైనట్టుంది పాపం.. అని సరదాగా నవ్వుకున్నారు. అయితే అంబులెన్స్‌లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది.. కానీ ఎవరైనా పేషెంట్ ఉండి ఉంటే అత్యవసర వైద్యానికి తరలించాల్సి ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఆందోళన.. అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీంతో అసలు 108 అంబులెన్స్‌ల పరిస్థితి ఎలా ఉందో, వాటిని నమ్మొచ్చా, ఎమర్జెన్సీలో వాటిపై ఆధారపడవచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. ఇప్పుడు ఈవీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
(Sravan, TV9 Telugu, Hyderabad)
మరిన్ని ఇక్కడ చదవండి :