AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Bandi Song: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి పాటతో ట్రీట్మెంట్.. వైరల్ వీడియో

బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మోహ‌న భోగ‌రాజు ఆ పాట‌లో అభిన‌యంతో ఆక‌ట్టుకోగా చాలామంది

Bullet Bandi Song: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి పాటతో ట్రీట్మెంట్.. వైరల్ వీడియో
Bullet Bandi Song Treatment
Venkata Narayana
|

Updated on: Sep 03, 2021 | 1:12 PM

Share

Bullet Bandi Song: సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు గానీ రోగుల్లో మాత్రం మార్పు తెస్తోంది. తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న బుల్లెట్టు బండి పాట ఓ రోగిలో చలనం తెచ్చింది. ఆస్పత్రి బెడ్ పై కదల్లేకుండా పడివున్న రోగి.. బుల్లెట్టు బండి పాట పెట్టగానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మోహ‌న భోగ‌రాజు ఆ పాట‌లో అభిన‌యంతో ఆక‌ట్టుకోగా చాలామంది అనుక‌రిస్తూ బీట్‌కు త‌గ్గట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ పాటకు కాళ్లు క‌ద‌ప‌గా.. తాజాగా మరోమారు ఈ పాట‌ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైర‌ల్ అయ్యి చక్కర్లు కొడుతోంది.

హాస్పిటల్ లో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు ఒక నర్సు వినూత్న ఆలోచన చేసింది. బుల్లెట్టు బండి పాటకు ఇలా డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నించేలా ప్రేరేపించింది. అతడికి పక్కనే ఉన్న నర్స్‌ సహాయం చేస్తూ.. ప్రొత్సహిస్తోంది.  నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఒక పాట ఓ రోగి మెదడును ఉల్లాసపరుస్తూ, దేహకదలికలపై కంట్రోల్ తీసుకొస్తూ, ఓ ఫిజియోథెరపీగా ఉపయోగపడుతుందని కొందరు కామెంట్‌ చేయగా, పక్షవాతంతో పడిపోయిన ఓ చేయిని తిరిగి రోగి స్వాధీనంలోకి తీసుకురావడానికి పాటే మందుగా, మర్దనగా, ప్రేరణగా వాడుతున్న నర్స్‌ పనితనానికి మరికొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కడ జరిగిందో ఈ సంఘటన తెలియదు గానీ ఇంటర్‌ నెట్‌లో దూసుకుపోతోంది.

Read also: CM Jagan: 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?