Rain Alert: హైదరాబాద్ నగరవాసులకు హై అలర్ట్.. మరికాసేపట్లో భారీ వర్షం..

తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ( భార‌త వాతావ‌ర‌ణ శాఖ ) వ‌ర్ష సూచ‌న చేసింది.

Rain Alert: హైదరాబాద్ నగరవాసులకు హై అలర్ట్.. మరికాసేపట్లో భారీ వర్షం..
Heavy Rain
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 03, 2021 | 7:35 PM

తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ( భార‌త వాతావ‌ర‌ణ శాఖ ) వ‌ర్ష సూచ‌న చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో వ‌ర్షం దంచికొట్టింది.  రాబోయే 3 గంట‌ల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల‌తో పాటు న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని IMD సూచించింది. ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని జ‌లాశ‌యాలు, చెరువుల‌కు, కుంట‌ల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది.

చినుకు సిటీని శాసిస్తోంది. నీటి బొట్టు.. నగరాన్ని తలకిందులు చేస్తోంది. నిన్న కురిసిన వర్షం..కాదు.. కాదు..కుంభవృష్టికి హైదరాబాద్‌వాసులు గజగజ వణికిపోయారు. అది మరిచిపోక ముందే ఈ రోజు కూడా మరోసారి పిడుగులాంటి వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

కోటి మందికిపైగా నివసిస్తున్న మహానగరాన్ని ఒక్క వర్షం షేక్ చేసింది. ఎంతలా అంటే …రాత్రికి రాత్రే హైదరాబాద్‌ మునిగిపోతుందేమోనన్న భయం అందరిలో కలిగి నిద్రపోనివ్వకుండా చేసింది. గంట గంటకు చినుకు సైజు పెరిగడంతో వర్షం ఓ ఉప్పెనలా మారింది. సాయంత్రం జడివానగా మొదలైన వాన..రాత్రికి కుంభవృష్టిగా మారడంతో పరిస్థితి ఎవరూ ఊహించని విధంగా మారింది.

గురువారం రోజు సరిగ్గా రాత్రి 7గంటలకు చినుకులతో మొదలైన వర్షం… గంటల వ్యవధిలోనే కుంభవృష్టిగా మారింది. హైదరాబాద్‌ నడిబొడ్డుగా ఉన్న వర్షపాతం గంట గంటకు వర్షపాతంపెరగడంతో నగరంలోని రోడ్లు, కాలనీలు, బస్తీల్లో సిస్ట్యూవేషన్ వరద ప్రాంతాలుగా మార్చేసింది. అయితే ఇంతకు మించన స్థాయిలో ఈ రోజు వర్షం పడనుంది. రోడ్లపై ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.

Rain

ఇవి కూడా చదవండి: Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..