Bharat Army: ఆర్మీ శిక్షణలో భగవద్గీత, కౌటిల్యుడి అర్ధశాస్త్రం.. సీడీఎం ప్రతిపాదనపై కస్సుమంటున్న కాంగ్రెస్ నేతలు
Gita in Bharat Army Curriculum: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రంథాలు వంటి అనేక అంశాలను విదేశీయులు పాటిస్తున్నారు. జర్మనీ వంటి దేశంలో సంస్కృతం భాషకు అత్యంత..
Gita in Bharat Army Curriculum: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రంథాలు వంటి అనేక అంశాలను విదేశీయులు పాటిస్తున్నారు. జర్మనీ వంటి దేశంలో సంస్కృతం భాషకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక నాసా లో ఓం కార నాదం వినిపిస్తుంది అనే వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలో భారతీయ సాయుధ బలగాలల్లో మరింత భారతీయత కనిపించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ కోరిక. ఆ దిశగా ఇప్పుడు సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అడుగులు వేస్తోంది. ప్రాచీన భారత సంస్కృతి, యుద్ధ నీతిని మన సాయుధ బలగాలకు నేర్పించాలని సీడీఎం భావిస్తోంది. సైనికులకు శిక్షణ కార్యక్రమంలో భగవద్గీతతో పాటు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కూడా చేర్చాలని సీడీఎం సిఫార్సు చేసింది.
సికింద్రాబాద్‌లోని ఈ సీడీఎం త్రివిధ దళాలకు శిక్షణ ఇచ్చే సంస్థ. ప్రాచీన భారత సంస్కృతి, యుద్ధ నీతులు.. వాటిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఎలా నేర్పించాలన్నదానిపై సీడీఎం ఓ నివేదికను రూపొందించింది.
అయితే ఇదే విషయంపై కాంగ్రస్ అభ్యంతరం తెలిపింది. కనీసం మిలటరీకి సంబంధించిన విషయాలపైన అయినా బీజీపీ ప్రభుత్వం రాజకీయాలు మానుకోవాలని హితవు పలికింది. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. ముస్లిం సైనికుల సహకారంతోనే కార్గిల్ యుద్ధాన్ని మనం గెలిచామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. భారత ఆర్మీ జవాన్ల కు ఇచ్చే శిక్షణా కరిక్యులమ్‌లో భగవద్గీత, కౌటిల్యుని అర్ధశాస్త్రం చేర్చాలనే ప్రతిపాదనపై కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు.