Queen Elizabeth II: తాను మరణించిన తరువాత ఏ విధంగా సమాధి చేయాలో ముందే రాసి పెట్టుకున్న మహారాణి.. పేపర్స్ లీక్

Surya Kala

Surya Kala |

Updated on: Sep 04, 2021 | 2:42 PM

Operation London Bridge: ఎక్కడైనా ఏ దేశంలోనైనా రాజుగారి కోటలో ఏమి జరుగుతుంది అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. మరి అలాంటి బ్రిటన్ రాజ వంశంలో పై ఉండే ఆసక్తి గురించి వేరే చెప్పాలా.. ఈ రాజవంశానికి..

Queen Elizabeth II: తాను మరణించిన తరువాత ఏ విధంగా సమాధి చేయాలో ముందే రాసి పెట్టుకున్న మహారాణి.. పేపర్స్ లీక్
Queen Elizabeth 11

Operation London Bridge: ఎక్కడైనా ఏ దేశంలోనైనా రాజుగారి కోటలో ఏమి జరుగుతుంది అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. మరి అలాంటి బ్రిటన్ రాజ వంశంలో పై ఉండే ఆసక్తి గురించి వేరే చెప్పాలా.. ఈ రాజవంశానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా అంతులేని సంచలనం సృష్టిస్తుంది. మరి అలాంటిది.. ఏకంగా బ్రిటన్ రాణి మరణిస్తే.. ఏమి చేయాలి అన్న విషయం లీక్ అయితే .. ఆ వివరాలు ప్రజల్లో ఎలాంటి ఆసక్తిని కలిగిస్తాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. అవును బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణించినప్పుడు ఏమి చేయాలి అనే వివరాలు ఉన్న పత్రాలు శుక్రవారం లీక్ అయ్యాయి. రాణి అంతిమశ్వాస విడిచిన దగ్గర నుంచి అధికారికంగా సమాధి చేసేవరకు నిర్వహించే ఒకపెద్ద మహాయజ్ఞంలిస్ట్ బహిర్గతమయ్యింది. అయితే ఇదే విషయంపై మాట్లాడడానికి బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు నిరాకరించారు.

బ్రిటన్ మహారాణి వెంటనే ప్రారంభమయ్యే కార్యక్రమాలను ‘‘ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌’’గా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది.

95 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ II, బ్రిటిష్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా చరిత్ర సృష్టించారు. ఆమె మరణించిన 10 రోజుల తర్వాత సమాధి చేయబడుతుంది. అప్పటి వరకూ ఆమె భౌతికకాయం అలాగే ఉంచబడుతుంది. 10 రోజుల అనంతరం ఆమె కుమారుడు వారసుడు ప్రిన్స్ చార్లెస్ గ్రేట్ బ్రిటన్ మొత్తం పర్యటించి.. రాణి మరణ వార్తను ప్రజలకు తెలియజేస్తాడు. అనంతరం ఎలిజబెత్ అంత్యక్రియలు మొదలు పెడతారు. సమాధి చేసే కార్యక్రమం షురూ చేస్తారు.

మరణానంతరం ఎలిజిబెత్ మృత దేహాన్ని మూడు రోజుల పాటు హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌లో సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు లండన్‌కు వస్తారని అంచనావేస్తున్నారు. దీంతో సందర్శనార్ధం వచ్చేవారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను , గందరగోళాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలు కూడా ఈ పేపర్ లో పొందుపరిచారు. అంతేకాదు మహారాణి మరణించిన అనంతరం కొత్త రాజు చార్లెస్ నాలుగు దేశాల్లో పర్యటిస్తారని పొలిటికో వెల్లడించింది.

Also Read:  ఊదలతో స్నాక్ ఐటెమ్.. కంద బఠాణీలతో టేస్టీ టేస్టీ కట్లెట్ తయారీ విధానం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu