Barnyard Millets Cutlet Recipe: ఊదలతో స్నాక్ ఐటెమ్.. కంద బఠాణీలతో టేస్టీ టేస్టీ కట్లెట్ తయారీ విధానం
Barnyard millets cutlet recipe: చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. ఈ ఊదలతో తయారు చేసే ఆహరం మంచి బలవర్ధకమైంది..
Barnyard millets cutlet recipe: చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. ఈ ఊదలతో తయారు చేసే ఆహరం మంచి బలవర్ధకమైంది. త్వరగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యానికి కలిగే మేలు చేసే ఊదలను అన్నంగానే కాదు. రకరకాల వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈరోజు ఊదలతో స్నాక్ ఐటెమ్ కట్లెట్ తయారీగురించి తెలుసుకుందాం..
తయారీకి కావలసిన పదార్ధాలు:
ఊదల పిండి – ఒక కప్పు కంద ముక్కలు – పావు కప్పు బఠాణీ – పావు కప్పు ధనియాల పొడి – ఒక టీ స్పూను నువ్వుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – అర టీ స్పూను వాము – ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి – ఒక టీ స్పూను మిరప కారం – అర టీ స్పూను కొత్తిమీర తరుగు కొంచెం ఉప్పు – రుచికి తగినంత నెయ్యి – తగినంత నిమ్మ రసం – ఒక టీ స్పూను జీడి పప్పు
తయారుచేసే విధానం:
ముందుగా స్టౌ మీద గిన్నె పెట్టుకుని అందులో నీరు పోసి.. కంద ముక్కలను తర్వాత, బఠాణీలను విడివిడిగా ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం నెయ్యి వేసుకుని వేడి ఎక్కిన తర్వాత జీడిపప్పుని వేయించుకుని తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అవసరం అయితే కొంచెం నెయ్యి వేసుకుని ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఉడికించిన కంద ముక్కలు, బఠాణీలు మిశ్రమాన్ని వేసి.. చపాతీ పిండిలా కలుపుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసుకుంటూ ఊదల మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. కట్‌లెట్‌లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పెనం పెట్టుకుని.. వేడి ఎక్కిన తర్వాత నూనె వేసుకోవాలి.. నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్న కట్ లెట్స్ ను రెండు వైపులా తిప్పుతూ.. కాల్చుకోవాలి. అనంతరం వాటిని ఓ ప్లేస్ లోకి తీసుకుని జీడి పప్పులతో అలంకరించుకోవాలి. ఈ కట్ లెట్స్ ను సాస్ తో సర్వ్ చేస్తే మంచి టేస్టీగా ఉంటాయి.
Also Read: నీటి ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్న ఏనుగు.. చుక్కనీరు వృధాకాకుండా.. దాహం తీర్చుకున్న తీరు..