Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..

Dieting Food : ఆర్యోగంగా, స్లిమ్‌గా ఉండేందుకు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కొందరు ఆకలిని నియంత్రించుకుంటారు. డైటింగ్ చేస్తుంటారు.

Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..
Diet Food

Dieting Food : ఆర్యోగంగా, స్లిమ్‌గా ఉండేందుకు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కొందరు ఆకలిని నియంత్రించుకుంటారు. డైటింగ్ చేస్తుంటారు. కానీ, బరువు తగ్గడం కోసం డైటింగ్ చేయాలా? చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? డైటింగ్ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమైతే పరిస్థితి ఏంటి? అసలు ఆహారం పట్ల ప్రజలకు ఎలాంటి అపోహలు ఉన్నాయి? అసలు వాస్తవాలు ఏంటి? ఇదే అంశంపై డైటీషియన్ రుచిత బాత్రా ఇటీవల ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో డైట్ కు సంబంధించిన వివరాలు, ఎలాంటి ఆహారం శరీరానికి అవసరం, ప్రజల్లో ఆహారం పట్ల ఉన్న అపోహలేంటి.. అసలు వాస్తవాలు ఏంటి.. అనే అంశాలను కూలంకశంగా ఆ పోస్ట్‌లో వివరించారు. మనిషికి కొవ్వులు అవసరం అని డైటీషియన్ రుచిత బాత్రా చెబుతున్నారు. డైట్ ఫాలో అయ్యేవారికి కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం చెడుగానే కనిపించినప్పటికీ.. ఆ కొవ్వు పదార్థాలు శరీరానికి చాలా అవసరం అని ఆమె ఉద్ఘాటిస్తున్నారు. మరి రుచిత బాత్రా చెప్పిన ప్రకారం.. ఈ కొవ్వు పదార్థాల పట్ల జనాల్లో అపోహలేంటి? వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అపోహ: పాల ఉత్పత్తులు బరువు పెరిగేందుకు దోహపడుతాయి..
వాస్తవం: పాల ఆధారిత ఉత్పత్తులు కాల్షియం, విటమిన్ డి, వివిధ రకాల కొవ్వులు, ప్రోటీన్లతో సహా అన్ని రకాల పోషకాలు, క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఆ పోషకాల నిష్పత్తి ఆహారం నుండి ఆహారానికి మారుతుంది. కావున వీటిని అవసరమైన మేరకు తింటే ప్రయోజనాలే తప్ప.. ప్రమాదకరం కాదు.

అపోహ: గుడ్డు సొనలు అనారోగ్యకరమైనవి..
వాస్తవం: పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి 12 , మరియు ఫోలేట్, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 185 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవన్నీ పచ్చసొనలో ఉంటాయి. కానీ బ్లడ్ కొలెస్ట్రాల్‌కు ఈ డైటరీ కొలెస్ట్రాల్ ప్రధాన కారణం కాదని తెలుసుకోవాలి.

అపోహ: ఆరెంజ్ జ్యూస్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువ..
వాస్తవం: ఇంట్లో తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలిపితే తప్ప, మిగతా పండ్ల మాదిరిగానే చక్కెర ఉంటుంది. అందువలన, తాజాగా పిండిన రసం మంచిది. స్టోర్‌లో కొనుగోలు చేసిన రసాలలో అదనపు చక్కెరలు ఉంటాయి. కావున వాటికి దూరంగా ఉండటం మంచిది.

అపోహ: కొవ్వు పదార్థాలు మిమ్మల్ని లావుగా చేస్తాయి..
వాస్తవం: కొవ్వు పదార్థాలు తినడం వల్ల మీరు బరువు పెరగరు. కానీ చెడు కొవ్వు పదార్థాలను తినడం వలన, ఎక్కువ కొవ్వు పదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతారు. కొవ్వులు హృదయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. డైటీషియన్ పరంగా కొవ్వు పదర్థాలను బ్యాడ్ నేమ్ ఉన్నప్పటికీ శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. వాటిని తప్పనిసరిగా సరైన పరిమాణంలో, నాణ్యతతో కూడిన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి.

అపోహ: కార్బోహైడ్రేట్లు మిమ్మల్ని లావుగా చేస్తాయి..
వాస్తవం: కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు మిమ్మల్ని లావుగా చేయవు. పిండి పదార్థాలు మిమ్మల్ని బరువు పెరిగేలా చేయవు. బరువు పెరగడం అనేది అధిక కేలరీలు తినడం వల్ల జరుగుతుంద తప్ప.. కార్బోహైడ్రేట్లు తినడం వల్ల కాదని బాత్రా స్పష్టం చేశారు.

Also read:

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..

Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!

Click on your DTH Provider to Add TV9 Telugu