Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..

Telangana : వారంతా ప్రజాప్రతినిధులు.. తెల్లవారింది మొదలు ప్రజలు ప్రజా శ్రేయస్సు అంటూ స్పీచ్ లు దంచికొట్టే నేతలు. వారి వాహనాలను సైతం స్పీచ్ ల కంటే వేగంగా మరింత జోష్ తో..

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..
Telangana Police
Follow us

|

Updated on: Sep 05, 2021 | 6:11 AM

Telangana : వారంతా ప్రజాప్రతినిధులు.. తెల్లవారింది మొదలు ప్రజలు ప్రజా శ్రేయస్సు అంటూ స్పీచ్ లు దంచికొట్టే నేతలు. వారి వాహనాలను సైతం స్పీచ్ ల కంటే వేగంగా మరింత జోష్ తో డ్రైవ్ చేసి కేసుల పాలవుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఈ ప్రజాప్రతినిధులంతా ట్రాఫిక్ నిబంధనలను అడ్డంగా ఉల్లంఘిస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్తూ ట్రాపిక్ రూల్స్‌ను అడ్డంగా తుంగలోకి తొక్కెస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే వాహనం పై పదుల సంఖ్యలో ట్రాపిక్ ఉల్లంఘన చలాన్లు ఉండగా వేలకు వేలు ట్రాపిక్ చలాన్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేల వాహనాలపై ట్రాపిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటికాదు రెండు కాదు పది వేలకు పైనే ఒక్కో ఎమ్మెల్యే ట్రాపిక్ చలాన్ చెల్లించాల్సి ఉంది. సామాన్యులకు ఒక లెక్క.. మాకోలెక్క అన్న రీతిలో ఈ పెండింగ్ చలాన్లు కనిపిస్తున్నాయి.

రోడ్డు భద్రత గురించి సామాన్య ప్రజలకు తెగ నీతిపాఠాలు చెప్పే ప్రజాప్రతినిధులు.. వారు మాత్రం ఇసుమంతైనా పాటించడం లేదన్నట్టుగానే కనిపిస్తుంది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో పది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఉండగా ఈ పన్నెండు మందిలో 9 మంది వాహనాలపై భారీ ట్రాపిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అతివేగంగా వెళుతూ ట్రాపిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ పై అత్యధికంగా ఈ చలాన్ కేసులు నమోదయ్యాయి. ఈయన వాహనంపై 28 ట్రాపిక్ ఉల్లంఘన కేసులున్నాయి. పురాణం సతీష్ కు చెందిన వాహనం టీఎస్ 19 బి 6666 పై 27,180 రూపాయల చలాన్లు ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే నడ్డిపెల్లి దివాకర్ వాహనంపై సైతం అదే స్థాయిలో కేసులున్నాయి. ఈయన వాహనంపై 26 పెండింగ్ చలాన్ కేసులున్నాయి. ఆయన వాహనం నెంబర్ టీఎస్ 19ఎ 9779 పై 26,010 రూపాయల చలాన్లు ఉన్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ వాహనం టీఎస్ 18 సి 0006 పై 15 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. 14,625 రూపాయల ట్రాపిక్ చలాన్లు చెల్లించాల్సి ఉంది. ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ రవాణాశాఖ ఉన్నాతాదికారి కావడం గమనార్హం.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వాహనంపై 2,070 రూపాయల ట్రాపిక్ ఉల్లంఘన చలాన్ పెండింగ్ లో ఉంది. ఈయన వాహనం నెంబర్ టీఎస్ 01 ఈఎన్ 0006. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనం 13 సార్లు ట్రాపిక్ వాయిలేషన్ కు‌ పాల్పడగా.. ఆయన వాహనం నెంబర్ టీఎస్ 01 ఈఎల్ 4444 పై 13,455 రూపాయల ట్రాపిక్ పైన్ పెండింగ్ లో ఉంది. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వాహనంపై 3,575 రూపాయల ట్రాపిక్ ఉల్లంఘనల కింద ఫైన్ విధించడం జరిగింది. ఆయన వాహనం నెంబర్ టీఎస్19 బి 9999. 2019 లో హైదరాబాద్ పరిదిలో రాంగ్ పార్కింగ్ ఫైన్ ఒకటుండగా.. 2021 లో మూడు ఓవర్ స్పీడ్ జరిమానాలు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు అనేవి సామాన్యుల కోసమే తప్ప.. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలకు కావని జనం‌ చర్చించుకునేది వాస్తవమే అనే తీరులో ప్రజాప్రతినిధులపై ట్రాపిక్ ఉల్లంఘన కేసులున్నాయి. మొత్తంగా ఒక్కో ఎమ్మెల్యేపై మూడేళ్లకు పైగానే ఈ ట్రాపిక్ ఉల్లంఘన బిల్లులు పెండింగ్ లో ఉండటం ఇక్కడ విశేషం అని చెప్పాలి.

Also read:

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..

Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!

Telangana: జిల్లాల కలెక్టర్లకు ఈ రూల్స్ వర్తించవా?.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు?..