China maritime law: కుయుక్తుల చైనా సముద్రాన్నీ అక్రమంగా ఆక్రమించేస్తోంది.. చట్టాలను చేసి మరీ ప్రపంచాన్ని బెదిరిస్తోంది!

చైనా కొత్త సముద్ర చట్టం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, చైనా సముద్ర సరిహద్దు మీదుగా వెళ్లే విదేశీ నౌకలన్నీ చైనా అధికారులకు తమ మొత్తం సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

China maritime law: కుయుక్తుల చైనా సముద్రాన్నీ అక్రమంగా ఆక్రమించేస్తోంది.. చట్టాలను చేసి మరీ ప్రపంచాన్ని బెదిరిస్తోంది!
China New Maritime Law
Follow us

|

Updated on: Sep 04, 2021 | 3:36 PM

China maritime law: చైనా కొత్త సముద్ర చట్టం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, చైనా సముద్ర సరిహద్దు మీదుగా వెళ్లే విదేశీ నౌకలన్నీ చైనా అధికారులకు తమ మొత్తం సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓడ సిబ్బంది దీనిని చేయకపోతే, చైనా వారిపై చర్యలు తీసుకోవచ్చు. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సముద్రంలో భద్రతకు సంబంధించిన ఈ చట్టాన్ని ఏప్రిల్‌లో సవరించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరోసారి వివాదం చెలరేగింది. చైనా ఈ చట్టం సముద్ర ట్రాఫిక్‌ను ప్రభావితం చేసే కొత్త మార్గం అనీ, అదేవిధంగా ఇది దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. చైనా చేసిన ఈ కొత్త చట్టం ఏమిటి? దీని గురించి ఎందుకు వివాదం ఉంది? ఈ చట్టం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించడానికి ఇది చైనా పన్నుతున్న కుయుక్తా? ఈ విషయాలను గురించి తెలుసుకుందాం.

చైనా కొత్త సముద్ర చట్టం ఏమిటి?

చైనా తన సముద్ర భద్రతను చూపుతూ సెప్టెంబర్ 1 నుండి కొత్త చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం, చైనా సముద్ర ప్రాంతాలలోకి ప్రవేశించిన ఇతర దేశాల నౌకలు తమ కాల్ సైన్, స్థానం, గమ్యం, ఓడలో లోడ్ చేసిన వస్తువుల సమాచారం, వేగం, లోడింగ్ సామర్థ్యాన్ని చైనా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే, చైనా తన చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ చట్టం ఏ నౌకలకు వర్తిస్తుంది అనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదు. చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, ఈ చట్టం జలాంతర్గాములు, అణు నౌకలు, రేడియోధార్మిక పదార్థాలతో నిండిన నౌకలు, చమురు, గ్యాస్, రసాయనాలను మోసే నౌకలకు వర్తిస్తుంది. దీనితో పాటు, చైనా భద్రతకు ముప్పుగా పరిణమించే అటువంటి నౌకలపై కూడా ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చునని చైనా చెప్పింది. అంటే, చైనా దాదాపు అన్ని రకాల విదేశీ నౌకలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చింది.

ఈ చట్టంపై ఎందుకు వివాదం..

చైనా సముద్రంలో తన జోక్యాన్ని నిరంతరం పెంచుతోంది. ఈ చట్టం ద్వారా, చైనా దక్షిణ, తూర్పు చైనా సముద్రం మీదుగా వెళుతున్న విదేశీ నౌకల కదలికను అడ్డుకోవాలనుకుంటోంది. ఈ చట్టం వెనుక చైనా ఉద్దేశం ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కఠిన చర్యలు తీసుకుంటే, అది సముద్ర ట్రాఫిక్‌ను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా దేశాల మధ్య వివాదాలకు దారితీస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, చైనా, ఒక చట్టం ద్వారా, కోస్ట్ గార్డ్‌కు అనుమానాస్పదంగా ఏదైనా విదేశీ నౌకపై దాడి చేసే హక్కును ఇచ్చింది. ఒకదాని తరువాత ఒకటిగా రెండు వివాదాస్పద చట్టాల ద్వారా, సముద్ర భద్రత సాకుగా చైనా అంతర్జాతీయ సముద్ర మార్గాన్ని అక్రమంగా ఆక్రమిస్తోంది.

భారతదేశానికి దక్షిణ-చైనా సముద్రం ఎందుకు ముఖ్యమైనది?

జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలతో వాణిజ్యం కోసం భారతదేశానికి దక్షిణ చైనా సముద్రం చాలా ముఖ్యమైనది. భారతదేశ మొత్తం సముద్ర వాణిజ్యంలో 55% దక్షిణ చైనా సముద్రం ద్వారా జరుగుతుంది. అక్టోబర్ 2011 లో, దక్షిణ చైనా సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ కోసం వియత్నాంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. 2019 లో, వియత్నాం సముద్ర ప్రాంతంలో 30 కి పైగా యుద్ధనౌకలను చైనా మోహరించింది.

సముద్ర సరిహద్దులపై అంతర్జాతీయ చట్టం అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సముద్ర ట్రాఫిక్ గురించి చైనా, భారతదేశంతో సహా 100 కి పైగా దేశాలలో ఒక ఒప్పందం కుదిరింది. దీనిని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) అంటారు. దీని ప్రకారం, ఒక దేశం భూమి నుండి 12 నాటికల్ మైళ్ళు (22.2 కిమీ) ఆ దేశ సముద్ర సరిహద్దుగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం, ఏ దేశమైనా వాణిజ్యానికి 12 నాటికల్ మైళ్ల దూరానికి మించి సముద్ర ప్రాంతాన్ని ఉపయోగించవచ్చు. ఈ దూరం తరువాత, ఏ దేశానికీ కూడా సముద్ర సరిహద్దు వర్తించదు. చైనా ఈ కొత్త చట్టం UNCLOS ఈ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తోంది.

చైనా ఈ చట్టాన్ని అన్యాయంగా సద్వినియోగం చేసుకుంది. వాస్తవానికి, చైనా దక్షిణ, తూర్పు చైనా సముద్రంలోని వివిధ ద్వీపాలను ఆక్రమించింది. చైనా ఈ ద్వీపాలను తనవేనని పేర్కొంది. ఈ ద్వీపాల దూరాన్ని బట్టి దాని సముద్ర సరిహద్దును కూడా లెక్కిస్తుంది. దీని కారణంగా, సముద్రంలో చైనా జోక్యం పెరుగుతోంది. 2016 లో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది, దక్షిణ చైనా సముద్రంలో చైనా జోక్యం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి చైనా నిరాకరించింది.

Also Read: Ireland Man Chris: 300 ఇంటర్వ్యూలకు వెళ్లిన నిరుద్యోగి.. ఉద్యోగం ఇవ్వమంటూ 40వేలు ఖర్చు చేసి బ్యానర్స్ ఏర్పాటు.. ఎక్కడంటే..

Queen Elizabeth II: తాను మరణించిన తరువాత ఏ విధంగా సమాధి చేయాలో ముందే రాసి పెట్టుకున్న మహారాణి.. పేపర్స్ లీక్

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన