Crime: సోషల్ మీడియాలో యువకుడి వెకిలిచేష్టలు.. మహిళగా నటిస్తూ.. అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే..?
AC mechanic tricks minor girls: దేశంలో రోజురోజుకూ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. మృగాళ్లు బాలికల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలికలను లోబరుచుకుని
AC mechanic tricks minor girls: దేశంలో రోజురోజుకూ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. మృగాళ్లు బాలికల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలికలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఓ ఏసీ మెకానిక్ సోషల్ మీడియాలో మహిళగా నటించి బాలికలు, యువతుల నుంచి అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పంపేలా ప్రేరేపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలిక ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నేరస్థుడి ఆటకట్టించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుక్రవారం అరెస్టు చేశారు. గతనెల 27న ఓ బాలిక (15) ఫిర్యాదు చేయడంతో నిందితుడు అబ్ధుల్ సమద్ ఆగడాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 27న మైనర్ బాలిక ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికలు, యువతులను వేధిస్తున్న గుర్తుతెలియని నిందితుడి వివరాలు రాబట్టేందుకు పోలీసులు వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంకు నోటీసులు పంపారు. ఆ వివరాలతో లక్నోలో నివసిస్తున్న నిందితుడు అబ్దుల్ సమద్ నివాసానికి చేరుకుని.. అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో మహిళగా పరిచయం చేసుకునే తాను యువతులు, బాలికలతో చాటింగ్ చేస్తూ.. వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపమని కోరుతుంటానని నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. అలా బాలికలు, యువతులు తమ అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పంపిన తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు యూట్యూబ్ ద్వారా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మొదట అమ్మాయిల ఖాతాలకు ఫోన్ చేసి.. ఎన్నారైగా పరిచయం చేసుకుంటాడని అనంతరం ఇలాంటి దారుణాలకు పాల్పడతాడని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. దీనికోసం నకిలీ ఖాతాల ద్వారా.. పలువురు అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి.. విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Also Read: