ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై విద్యార్థి అఘాయిత్యం.. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 04, 2021 | 4:12 PM

Trainee air hostess sedated: సోషల్ మీడియా పరిచయంతో కొంతమంది మృగాళ్లు.. యువతులపై దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై..

ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై విద్యార్థి అఘాయిత్యం.. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..
woman Raped

Follow us on

Trainee air hostess sedated: సోషల్ మీడియా పరిచయంతో కొంతమంది మృగాళ్లు.. యువతులపై దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాలో ప‌రిచ‌య‌మైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌కు.. ఇంజనీరింగ్‌ విద్యార్థి మ‌త్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా నిందితుడు లైంగిక దాడి దృశ్యాల‌ను కెమెరాలో రికార్డు చేసి యువ‌తి (22) పై ప‌లుమార్లు లైంగిక దాడికి తెగ‌బ‌డినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేది (22)ని న‌గ‌రంలోని వెజాల్పూర్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏడు నెల‌ల కింద‌ట ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌కు ఇన్‌స్టాగ్రాంలో త్రివేది పరిచయమయ్యాడు. ఆతర్వాత వారిద్దరూ ఫోన్‌ నెంబర్లు మార్చుకుని చాటింగ్‌ చేసుకునేవారు. అనంతరం వ్యక్తిగతంగా క‌లుసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఏప్రిల్‌లో యువ‌తిని త‌న ఇంటికి రావాల‌ని త్రివేది కోరగా.. యువతి అక్కడికి వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు.. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఇచ్చాడు.

ఆమె స్రృహ కోల్పోగానే నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాల‌ను నిందితుడు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం నిందితుడు బాధితురాలికి వీడియోలను చూపుతూ.. ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime: సోషల్‌ మీడియాలో యువకుడి వెకిలిచేష్టలు.. మహిళగా నటిస్తూ.. అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే..?

Khammam District: పచ్చని కాపురంలో నిప్పులు.. అక్రమ సంబంధం కాటుకు ముగ్గురు బలి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu