King Charles: బ్రిటన్‌ రాజు దంపతులకు చేదు అనుభవం.. గుడ్లు విసిరిన యువకుడు.. వీడియో..

వారు అందరిలా సాధారణ మనుషులు కాదు.. ఓ రాజ్యానికి రాజు, రాణి.. అలాంటి రాజు దంపతులపై అందరూ చూస్తుండగా.. ఓ యువకుడు గుడ్లతో దాడి చేశాడు.

King Charles: బ్రిటన్‌ రాజు దంపతులకు చేదు అనుభవం.. గుడ్లు విసిరిన యువకుడు.. వీడియో..
King Charles
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 10, 2022 | 6:05 AM

వారు అందరిలా సాధారణ మనుషులు కాదు.. ఓ రాజ్యానికి రాజు, రాణి.. అలాంటి రాజు దంపతులపై అందరూ చూస్తుండగా.. ఓ యువకుడు గుడ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బ్రిటన్‌లో కలకలం రేపింది. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 దంపతులకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉత్తర ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఛార్లెస్‌ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. అంతటితో వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3.. ఈసారి మాత్రం తనపై దాడి జరుగుతున్నా.. అలానే చూస్తుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అందరూ దీనిపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌ నగరంలో జరిగిన ఓ వేడుకలో రాజు ఛార్లెస్‌-3, ఆయన సతీమణి కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన వారితో కింగ్‌ ఛార్లెస్‌ కరచాలనం చేస్తూ, వారిని పలుకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ యువకుడు కింగ్‌ ఛార్లెస్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ షాకయ్యారు. కొన్ని క్షణాలపాటు అక్కడే నిలబడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయి.. నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ నూతన రాజుగా కింగ్‌ ఛార్లెస్‌-3 బాధ్యతలు స్వీకరించారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛార్లెస్‌-3కి చేదు అనుభవం ఎదురవ్వడంతో.. అంతా షాకయ్యారు.

మొత్తం మూడు కోడిగుడ్లు విసరినట్లు అధికారులు తెలిపారు. అయితే.. అవి కింగ్‌ ఛార్లెస్‌ కు తాకలేదు. అతని కాళ్ల దగ్గర పడ్డాయని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే