AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆచూకీ చెప్పండి.. నాలుగేళ్లుగా భార్య కోసం భర్త, తల్లి కోసం పిల్లల పోరాటం.. పని కోసం సౌదీ వెళ్లి..

ఉన్న ఊరులో ఉపాధి లేదు. పని చేసుకుందామంటే పని దొరకదు. చేసేది ఏమి లేక కట్టుకున్న వాడి కోసం, కన్న బిడ్డల కోసం బతుకు బాట పట్టింది. పక్క ఊరో, జిల్లానో కాదు.. రాష్ట్రం అంతకంటే కాదు.. దేశం కాని దేశంలోకి వెళ్లింది.

Andhra Pradesh: ఆచూకీ చెప్పండి.. నాలుగేళ్లుగా భార్య కోసం భర్త, తల్లి కోసం పిల్లల పోరాటం.. పని కోసం సౌదీ వెళ్లి..
Kadapa Women Missing
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2022 | 6:15 AM

Share

ఉన్న ఊరులో ఉపాధి లేదు. పని చేసుకుందామంటే పని దొరకదు. చేసేది ఏమి లేక కట్టుకున్న వాడి కోసం, కన్న బిడ్డల కోసం బతుకు బాట పట్టింది. పక్క ఊరో, జిల్లానో కాదు.. రాష్ట్రం అంతకంటే కాదు.. దేశం కాని దేశంలోకి వెళ్లింది. ఉపాధి ఆశతో బ్రోకర్లు చెప్పిన మాటలకు నమ్మిపోయింది. కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయుడి భార్య మల్లీశ్వరి నాలుగేళ్ల క్రితం ఏజెంట్లు చెప్పిన మాయ మాటలతో సౌదీకి వెళ్లింది. ఏజెంట్లు ఈశ్వరయ్య, సాదక్, మౌలాలీలు చెప్పిన మాటలు నమ్మి.. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏడారి దేశంలోకి వెళ్లింది. ఇక అంతే.. ఆ తర్వాత మల్లీశ్వరి జాడా తెలిస్తే ఒట్టు. ఏమైందో తెలియదు. ఏమి చేస్తుందో తెలియదు. ఎక్కడుందో తెలియదు. ఆక ఆచూకీ కోసం ఎవరిని అడిగినా సమాధానం లేదు. పోలీసులను అడిగితే ఎలాంటి సమాచారం లేదు. ఎన్ని సార్లు స్టేషన్‌ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. నాలుగేళ్ళ నుంచి ఇలానే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామంటూ మల్లీశ్వరి భర్త సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఇక అమ్మ ఉన్నా కళ్ల ముందు కనిపించక పోవడంతో పిల్లలు తల్లడిల్లి పోతున్నారు. అమ్మ కావాలంటూ రోదిస్తున్నారు. మోసపూరిత మాటలు చెప్పి సౌదీకి పంపిన ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సుబ్బారాయుడు, పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా.. కమలాపురం పెదచొప్పలికి చెందిన సుబ్బరాయుడు ఫిర్యాదుపై కడప డీఎస్పీ స్పందించారు. నాలుగేళ్ళ క్రితం సుబ్బరాయిడు భార్య మల్లేశ్వరి సౌది వెళ్ళినట్లు తెలిపారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇండియాకు రాలేదని.. ఏజెంట్లు ఆమెతో మాట్లాడించక పోవడంతో సుబ్బరాయుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల తొమ్మిది నెలల క్రితం మల్లేశ్వరిని పెద చొప్పలికి చెందిన ఈశ్వరయ్య , ప్రొద్దుటూరుకు చెందిన సాదిక్ అలీ, మౌలాలీలు సౌదీ పంపించారన్నారు.

వీరిలో మౌలాలి ముంబాయిలో ఉంటాడడని.. సుబ్బరాయుడి భార్య మల్లెశ్వరికి మాయ మాటలు చెప్పి బాగా డబ్బు సంపాదించవచ్చు అని సౌదీ పంపించాడని తెలిపారు. వెళ్ళిన ఏడాది తరువాత తనను ఏజెంట్లు మోసం చేశారని.. కమీషన్ కోసం పంపించారని, ఇంటికి రప్పించాలంటూ భర్తతో మల్లేశ్వరి చెప్పిందని.. అప్పటినుంచి జాడ లేదని వెల్లడించారు. ముగ్గురు ఏజెంట్లపై కమలాపురం స్టేషన్ లో 228/22 US 420 IPC కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. వివిధ శాఖలతో మాట్లాడి మల్లేశ్వరిని ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..