Tomato Price: టమాటా రైతు కంట కన్నీరు.. మార్కెట్లో కిలో 50 పైసలు.. కస్టమర్ కొనాలంటే కిలో టమాటా రూ.19
ఏపీలోని టమోటా రైతు నోట్లో మళ్లీ మన్నే పడింది. బహిరంగ మార్కెట్లల్లో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో రోడ్లపైనే పారబోసి వెళ్తున్నారు. వినియోగ దారులకు మంట.. లేక పోతే రైతుల నోట్లో మట్టి అన్నట్టుగా మారింది.
రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు.. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి.. కన్నబిడ్డలకంటే అధికమైన ప్రేమతో పంటలను సంరక్షిస్తూ.. పంటలను పండించే పంట మాత్రం అవసరమైతే మార్కెట్ లో కిలో అర్ధ రూపాయికి కూడా దొరుకుంటుంది. టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలోని టమాటా రైతులు.. నష్టపోతూనే ఉన్నారు. ఏపీలోని టమోటా రైతు నోట్లో మళ్లీ మన్నే పడింది. బహిరంగ మార్కెట్లల్లో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో రోడ్లపైనే పారబోసి వెళ్తున్నారు. వినియోగ దారులకు మంట.. లేక పోతే రైతుల నోట్లో మట్టి అన్నట్టుగా మారింది.
టమోటా రైతు మళ్లీ బోల్తా పడ్డాడు. అన్ని కష్టాలు దాటుకొని పంటను మార్కెట్‌కు తెస్తే.. ధర లేక తెల్లమొఖం వేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన సరుకుకు దారి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు మంచి ధరతో 4 రాళ్లు వెనకేసుకున్న రైతులు.. రెండు రోజులుగా ఉన్న రేట్లతో ఏమి చేయాలో పాలుపోని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో 50 పైసలు మాత్రమే ఇస్తామనడం.. కొంత సరుకును కనీసం కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి ఉంది.
వ్యాపారులు పెడుతున్న ధరలను చూసి రైతుల కండుపు మండి పోతోంది. కిలో 50 పైసలకు అమ్ముకోలేక.. రోడ్డుమీదనే పారబోసి వెళ్తున్నారు రైతులు. కనీస మద్దతు ధర కోసం దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. టమోటాను ప్రత్యామ్నయంగా వాడేందుకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..